CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన, పి ఎ సి ఎస్ అధ్యక్షులు ఎగ్గడి. అంజయ్య

Share it:

 


.            మన్యం మనుగడ వాజేడు.                   ములుగు జిల్లా వాజేడు మండలo మురుమురు గ్రామపంచాయతీ ప్రగళ్లపల్లి లో, పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను, ఎగ్గడి. అంజయ్య. సర్పంచ్ పూసం. నరేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కష్టమే మిగులుతుందని రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం నిర్ణయించిన ధర, వరి కింటాకి  ఏ గ్రేడ్ కు,1960/ రూపాయలు.                               బి గ్రేడ్ , 1940/ రూపాయలుగా నిర్ణయించారు.                                  

కష్టకాలంలో ఆదుకునే రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగమే  కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు ఒకవైపు. కల్తీ పురుగు మందులు, ఎరువులు ఇంకోవైపు రైతులను చుట్టుముడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సాగుపై చిన్నచూపు చూడడంతో రైతులకు ఆసరా దొరకడం లేదు. సేద్యం గిట్టుబాటు కావడం లేదన్న సంగతి రైతులకు తెలిసిన విషయమే అయినా. చేసేది లేక నష్టంతో నైనా సాగు చేస్తూ జీవిస్తున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపవలసిన అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని కేంద్ర ప్రభుత్వం  రైతు చట్టాలపై గత సంవత్సర కాలంగా నిరసన తెలిపిన పట్టించుకోవడంలేదని రైతులపై చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోలు చేయాలని సర్పంచ్ పూసం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌరారపు. కోటేశ్వరరావు. వార్డు మెంబర్ .కృష్ణ. డైరెక్టర్. శంకర్ దయాల్, పిఎసిఎస్ ,మేనేజర్ సత్యనారాయణ. కొనుగోలు కేంద్రం ఇంచార్జ్,  రాంబాబు. గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: