CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు.

Share it:

 



  • యథేచ్ఛగా సమాచార హక్కు చట్టం ఉల్లంఘన.....?
  • సమాచారం అడిగి నెలలు గడుస్తున్నా అందని సమాచారం...?
  • భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట పంచాయతీలో అసలేంజరుగుతుందో అర్ధం కాని పరిస్థితి....!
  • సమాచార హక్కు చట్టం, నియమ నిబంధనలను సైతం భేకాతరు చేస్తున్న అధికారులు


 మన్యంటీవి, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీ 2020-2021 లో నాటిన నాలుగో (4) విడతల హరితహారం మొక్కల కొనుగోలు వివరాలు, ఎన్ని మొక్కలు స్థానిక పంచాయితీ వారి పరిధిలో ఎన్ని మొక్కలు నాటరో వాటికి సంబంధించిన వివరాలు కోరుతూ అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీ ఈఓ కు, ఓ వ్యక్తి ది:-31-07-2021 నాడు ఆర్ టి ఐ (RTI) సమాచార హక్కును దాఖలు చేయడం జరిగినది. కానీ సంబంధిత అధికారులు మాత్రం రేపు రేపు అంటూ కాలాన్ని గడపుతున్నారు తప్పా నెలలు గడుస్తున్నా కానీ స్థానిక పంచాయితీ నుండి సమాచారం రాకపోవడం విశేషం భారతదేశం లో అత్యున్నతస్థానం ఆర్ టి ఐ (RTI)సమాచార హక్కు చట్టానికి ఉన్నప్పటికీ చట్టాన్ని సైతం తుంగలో తొక్కడం అశ్వారావుపేట గ్రామపంచాయతీ అధికారుల పనితీరు, సమాచార హక్కు చట్టం అంటే ఎంత గౌరవమో అద్దం పడుతోంది. ఈ విషయం పట్ల పై అధికారుల స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది…..? కొన్నికొన్ని సార్లు అశ్వారావుపేట లో గల పలు కార్యాలయాలు సైతం సమాచారం కావాలంటే ప్రజలు నెలలు తరబడి వేచి చూడాల్సి వస్తుందనేది పలువురి ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా వివిధ కార్యాలయాల్లో సమాచారహక్కు చట్టం అధికారాన్ని తుంగలొ తొక్కడం విశేషం. సమాచారహక్కు చట్టం…..!

గతంలో ఉన్న ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు,

కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందివ్వాలని చట్టం చెబుతోంది. కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

Share it:

TS

Post A Comment: