CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-:తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్.

Share it:

 





మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట , రమణక్కపేట,పాలాయిగూడెం, బెస్తగూడెం, చుంచుపల్లి, గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గపూర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ లు శనివారం ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ మంగపేట మండలంలో సుమారుగా నెల రోజుల నుంచి వరి కోతలు ప్రారంభమైనాయని, ఒక పట్ట కిరాయి 20 రూపాయలతో ఒక రైతు 20 నుంచి 30 పట్టాలు కిరాయికి తీసుకొస్తా ఉన్నారని, ఇరవై రోజుల నుండి ఒక బస్తా కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఒకవైపు వడ్లు వర్షం లో తడుస్తూ మొలకెత్తుతున్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం గన్నీ సంచులు కొనుగోలు కేంద్రాలను సప్లై చేయలేదని ఆరోపించారు. నామ మాత్రంగా అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులుదులుపుకుంటున్నారని విమర్శించారు. శనివారం రోజు కూడా వర్షం కురుస్తుందని, రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడని, వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించి, ఎలాంటి తరుగు తీయకుండా తడిసిన ధాన్యం తో సహాకొనుగోలు చేయాలని వారు స్పష్టంచేశారు.వరి సాగు పై నియంత్రణ ఎత్తి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సందీప్, మహేష్, సమ్మయ్య, సరోజన, రవి, బాబు, అనూష, మౌనిక, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: