CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులు క్రమశిక్షణతోనే అద్భుతాలు సాధించవచ్చు-:ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం.

Share it:

 


  •  విద్యార్థులు తరగతి గది దాటి ఆలోచించినప్పుడే ఎంతో ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు.


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బుధవారం చైల్డ్ సే దోస్తీ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు ఐసిపిఎస్ పివో  ఎన్ఐసి హరిక్రిష్ణ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా ఐటిడిఎ కార్యాలయం,ఏఎస్పి కార్యాలయం,ఏటూరునాగారం పోలీస్స్టేషన్,సిడిపివో,ఎంపీడీవో కార్యాలయాలు,అంగన్వాడీ కేంద్రం,మీసేవలను సందర్షించి సంబంధిత అధికారుల ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలను సందర్షించి ఆయా శాఖల పనితీరు,ప్రభుత్వ పరంగా ప్రజలకు అందించే సేవలు గురించి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఏఎస్పి విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ కలిగి ఉంటేనే మనం అద్భుతాలు సృష్టించగలమని అన్నారు.విద్యార్థి దశలోనే ప్రభుత్వ సేవల పనితీరు తెలుసుకునే కార్యక్రమములో పాల్గొనడం వలన భవిష్యత్తులో ప్రభుత్వ సేవలను క్రమ బద్దంగా వినియోగించుకునే విధంగా  బాలలు ఎదుగుతారని అన్నారు.ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పి,సీఐ కిరణ్ కుమార్ సమక్షం లో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి  ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలను వివరించారు. అందులో భాగంగా పోలీస్ శాఖ తరపున ముందుగా నేరాలు జరుగకుండా చర్యలు చేపడతామని,ఒకవేళ నేరం జరిగితే దానిని నేరస్తులను గుర్తించి వారికి చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని, సమాజంలో ఎలాంటి అలజడులు జరుగకుండా 

లా అండ్ ఆర్డర్ ను కాపాడుతామని వివరించారు.

ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రసూనారాణి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గది దాటి ఆలోచించినప్పుడే వారు ఉన్నత జ్ఞానాన్ని పొందుతారని అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు గొప్ప విజానాన్ని నేర్చుకుంటారని,ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎంపీడీవో అనురాధ విద్యార్థుల బృందానికి వారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది,ఉపాధ్యాయులు సమ్మయ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: