CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బీటిపిఎస్ కోల్ ట్రాన్స్పోర్ట్ టర్లు..

Share it:

 


  • చోద్యం చూస్తున్న అధికారులు, మరియు సింగరేణి, btps యాజమాన్యాలు.

  •   ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి.

 మన్యం టీవి, మణుగూరు:

  బి టి పి ఎస్  కోల్ ట్రాన్స్పోర్టు దారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రమాదాలు నివారించవలసిన అధికారులు, మరియు సింగరేణి, btps యాజమాన్యాలు చోద్యం చూస్తున్నారని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కోల్ ట్రాన్స్పోర్ట్ దారుల కాసుల  కక్కుర్తి ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి  అని అన్నారు. ఒక డ్రైవర్ కు చట్ట ప్రకారం 8 గంటలకు 600 రూపాయల పై చిలుకు వేతనం చెల్లించవలసి ఉండగా 24 గంటల డ్యూటీ చేయించుకొని తొమ్మిది వందల రూపాయల వేతనం చెల్లిస్తూ, ట్రిప్పు కు 100 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పడం వలన డ్రైవర్ లు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే ఆలోచన తో స్పీడ్ గా వాహనాలు  నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాక, అనేక మంది గాయాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తరచూ జరిగే ప్రమాదాలకు  కోల్ ట్రాన్స్పోర్ట్ దారులే బాధ్యత వహించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కానీ, సింగరేణి, btps యాజమాన్యాలు గాని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ సింగరేణి ,btps యాజమాన్యాలు గాని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 గంటల డ్యూటీ విధానాన్ని రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, చట్టప్రకారం డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోల్ టాన్స్పోర్ట్ దారులు ఇదే విధానాన్ని  కొనసాగిస్తే ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామన్నారు.

Share it:

TS

Post A Comment: