CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మా దరఖాస్తులను నిరాకరిస్తున్నారు.నోడల్ అధికారికి మొరపెట్టుకున్న పోడు రైతులు .

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మేము పెట్టుకునే దరఖాస్తులను ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటీ సభ్యులు నిరాకరిస్తున్నారని వాగొడ్డు గూడెం, రాజుపేట, రమనక్కపేట గ్రామాలకు చెందిన పోడు రైతులు  జిల్లా నోడల్ అధికారి శ్రీరాములుకు మోర పెట్టుకున్నారు. గురువారం  మండలంలోని వాగొడ్డుగూడెం తదితర గ్రామాల్లో జరుగుతున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నోడల్ అధికారి శ్రీరాములు పరిశీలించగా. ఈ సందర్భంగా రైతులు ఆయనతో మాట్లాడుతూ తమ పోడు భూమి శనిగకుంటా బీట్ పరిధిలో ఉందని ఆ భూమికి సంబంధించిన పత్రాలు తీసుకుని దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే ఆ గ్రామ ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటీ సభ్యులు మీకు ఈ పరిధిలో భూమి లేదని మీ దరఖాస్తులు తీసుకోమని నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా మా దరఖాస్తులు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన నోడల్ అధికారి స్థానిక తహశీల్దార్ కు విషయం తెలియజేసి ఏ గ్రామ పంచాయతీ పరిధిలో భూమి ఉంటే ఆ గ్రామానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటీ దరఖాస్తులు తీసుకునే విధంగా సూచనలు చేయాలని తెలిపారు. అదేవిధంగా రైతులు ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, కృష్ణాజీ, మరియు రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: