CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొడుభూములకు హక్కు పత్రాలు త్వరగా అందిచాలి.పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి--:మండల మహాసభలో మాజీ ఎంపీ మీడియం బాబురావు

Share it: మన్యం టివి దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారుల హక్కు పాత్రలు త్వరగా అందించాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించలని మాజీ ఎంపీ మీడియం బాబురావు డిమాండ్ చేశారు సోమవారం ములకపాడు గ్రామంలో నిర్వహించిన సీపీఎం పార్టీ8.వ మండల మహాసభలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ సంస్కరణ పేరుతో దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను సరిహద్దు లో సంయుక్త కిసాన్ మార్చ్ అద్వర్యం లో చేసిన సుదీర్ఘ రైతుల పోరాట ఫలితంగానే రద్దు చేసారని అన్నారు.750 మంది రైతుల ప్రాణత్యాగం ఫలితమే నల్ల చట్టాల రద్దు అన్నారు . కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఆయన ప్రధాని మోదీ పై నమ్మకం లేక పార్లమెంట్ లో నల్ల చట్టాలను ఉపసంహరించునే వరకు ఉద్యమన్నీ కొనసాగించాలని సంయుక్త కిసాన్ మార్చ్ ప్రకటించి ఉద్యమం కొనసాగించడం లో సీపీఎం పార్టీ. దాని ప్రజాసంగలు తోడ్పాటు అందిచాలి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదరులందరికి హక్కు పత్రాలు అందచేయాలని కోరారు. ఈ మహాసభ లో 13.జోన్ల నుండి డేలిగెట్స్ చర్చల్లో పాల్గొన్నారు. సి పి యం నూతన మండల కార్యదర్శి గా కారం పుల్లయ్య ఏనుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి అన్నవారపు కనకయ్య ,జిల్లా నాయకులు యాలమంచి రవికుమార్, కారం పుల్లయ్య ,యాలమంచి వంశీ, బొల్లి సూర్యచందర్ రావు, కోర్సచిలకమ్మ,సరియం కోటేశ్వరరావు, మరియు పార్టీ శ్రేణులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: