CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు.కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలోని జిల్లా మరియు మండల ముఖ్య నాయకులను కోరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకై జిల్లాలోని జిల్లా మరియు మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు దనసరి సీతక్క.  అనంతరం సీతక్క  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహనను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,ములుగు నియోజకవర్గంలో లో 302 పోలింగ్ బూత్ లు ఉన్నాయని,ప్రతి పోలింగ్ బూత్ కు వంద సభ్యత్వాలకు తగ్గకుండా ప్రతి పోలింగ్ బూత్ లో 100 సభ్యత్వ నమోదు చేయాలని,ప్రతి సభ్యత్వ నమోదుకు 35 రూపాయలు సభ్యులు చెల్లించాల్సి ఉందని,ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే కనుక వారికి 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు.కనుక మండలంలోని ముఖ్య నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కృషి చేయాలని అన్నారు.అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయాన్ని చేస్తున్నాయని,ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లు ఉంది వారి ప్రవర్తనలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుల నల్ల చట్టాలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పూర్తిగా మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.రైతుల విషయంలో ఇద్దరు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తూ రైతు ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను కొనుగోలు చేయక రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గింజను కొనుగోలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ పార్టీ కొనుగోలు చేయట్లేదని అంటున్నారని,కావున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటాలు ఉధృతం చేస్తామని,పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేసి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు పైడాకుల అశోక్, చల్లా నారాయణరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రాం రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి. ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇరసవడ్ల వెంకన్న, జడ్పీటీసీ నామ కరంచంద్ గాంధీ, పులుసం పుష్పలత- శ్రీనివాస్, ఎంపీపీ బానోత్ విజయ- రూప్ సింగ్,మండలాల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా,జాలపు ఆనంతరెడ్డి,చిటమట రఘు, మైల జయరాం రెడ్డి,ఎండి. అఫ్సర్ పాషా,వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు,సహకార సంఘ అధ్యక్షులు బొక్క సత్తి రెడ్డి,పన్నాల ఎల్లారెడ్డి, పులి సంపత్,వర్కింగ్ ప్రెసిడెంట్లు రసపుత్ సీతారాంనాయక్, బండి శ్రీనివాస్,సుంకరబోయిన మొగిలి మరియు సర్పంచులు, ఎంపీటీసీలు,ఉపసర్పంచులు, వార్డు సభ్యులు,సహకార సంఘ డైరెక్టర్లు,జిల్లా,మండల మరియు గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ ప్రజా ప్రతినిధులు,మాజీ మండల అధ్యక్షులు,ఎంపీపీలు, జడ్పీటీసీలు,జిల్లా నాయకులు,ముఖ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: