CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలు ఆపాలి.

Share it:

 *



  •  రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్.
  • కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా సమావేశానికి ముఖ్య అతిధిగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ.పండించిన ప్రతి గింజను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ కష్టాలను తొలగిస్తారని ఎంతో నమ్మకంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఓట్లు వేసి గెలిపిస్తే,ఇప్పుడు కేంద్రం మీద రాష్ట్రం,రాష్ట్రం మీద కేంద్రం దొంగ ధర్నాలు చేస్తూ ఉంటే రైతుల కంటి నీటిని తుడిచేదెవరు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇప్పుడు కొనుగోలు చేసే దిక్కులేక రైతన్న జీవితం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు.ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారు.అని రైతన్న కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నాడు. రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెట్టివేసుకుంటూ చోద్యం చూస్తున్నాయి.నిన్న కురిసిన వర్షాలకు కల్లాలల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్ద అయిన ప్రభుత్వాలు పట్టించు కోవట్లేదని అన్నారు.ఇప్పటికి అయిన ప్రభుత్వాలు ప్రజల గురించి,ప్రజల కష్టాల గురించి ఆలోచించాలని,వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని,తడిసిన ధాన్యానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రైతుల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు,ధర్నాలకు, రాస్తారోకోలు చేయడానికైనా మేము సిద్ధం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్య, పారిశ్రామిక శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి,ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, ములుగు నియోజకవర్గ అధికార ప్రతినిధి అంగోత్ వంశీకృష్ణ,జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి గుంటోజు శంకర్, జిల్లా మైనారిటీ కార్యదర్శి ఎండి.అజ్జు,యూత్ నాయకులు మామిడిశెట్టి కోటి, మాజీ ఎంపీటీసీ కూనూరు రాజేందర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: