CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నీటి పంపు కనెక్షన్ ఇవ్వడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు.

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: చట్టబద్ధంగా పేరాయిగూడెం గ్రామంలో నివసిస్తున్న  మా కుటుంబానికి నీటి పంపు కనెక్షన్ ఇవ్వడం లేదని నార్లపాటి సుబ్బారావు అనే పేరాయిగూడెం గ్రామస్తుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండల పరిధిలోని పేరాయిగూడెం గ్రామ పంచాయతీ నెహ్రూ నగర్ కు చెందిన  నార్లపాటి సుబ్బారావు ఇల్లు నిర్మించుకొని కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్నారు. అదే ఇంటికి కరెంటు సౌకర్యం కూడా కల్పించారు. కొన్ని సంవత్సరాలుగా నీటి పంపు కనెక్షన్ ఇవ్వమని గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పంచాయతీ అధికారులు మీకు పంపు కనెక్షన్ ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పారని, దానికి ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్న మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు లో భాగంగా  ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరితో పాటు మాకు కూడా నీటి పంపు కనెక్షన్ ఇవ్వమని పలుమార్లు కోరామని, పంచాయతీ అధికారులు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ నీటి పంపు కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, క్రింది స్థాయి నుండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నామని పై అధికారులు సూచించినప్పటికీ, స్థానిక పంచాయతీ అధికారులు మాకు నీటి పంపు కనెక్షన్ ఇవ్వడం లేదని, గత నెలలో  జిల్లా పంచాయతీ అధికారి పరిశీలనకు వచ్చినప్పుడు కూడా వారికి సమస్యలు విన్నవించామని, వారు వెంటనే నీటి పంపు కనెక్షన్ ఇవ్వాలని పేరాయి గూడెం గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారని అయినప్పటికీ ఇంతవరకు నీటి పంపు కనెక్షన్ ఇవ్వడం లేదని నార్ల పాటి సుబ్బారావు ఆరోపించారు. మరల ఈ రోజు జిల్లా కలెక్టర్ అశ్వారావుపేట పర్యటనకు రాగా మరొకసారి కలసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, ఉన్నతాధికారులు దృష్టి సారించి నీటి పంపు కనెక్షన్ ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, మాకు నీటి ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: