CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏటూరు నాగారం ఐటిడిఏకు రెగ్యులర్ పీవో ను నియమించాలి--:ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

తక్షణమే ఐటిడిఏకు రెగ్యులర్ పీవో ను నియమించాలని,  లేకుంటే మంత్రి ని,జడ్పీ చైర్మన్ ని జడ్పీ వైస్ చైర్మన్ ని ఏజెన్సీ ప్రాంతం లో తిరగనియ్యం అని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి అన్నారు. మేడారం లో ఏర్పాటు చేసిన తుడుం దెబ్బ సమావేశం లో ఏ ఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్దకాలం గాడిచిన ఆదివాసుల కొరకు విడుదల చేసిన ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఆదివాసీలకు అందని ద్రాక్షగా మారాయని రిజర్వేషన్ల ఊసేలేదనీ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం కేటాయించిన ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మిషన్ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరా నిధులు మళ్ళించి ఆదివాసులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఏటూరునాగారం ఐటీడీఏ లో వివిధ శాఖలను గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రోద్బలంతో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి,మహబూబాబాద్.ప్రాంతానికి తరలించాలి అనుకోవడం ఆదివాసీల అణచివేతకు ఒక కారణమే అని అన్నారు.ఐటిడిఎ లో వివిధ శాఖలు తరలిస్తుంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆలోచించి శాఖల తరలింపు అడ్డుకోక పోవడం బాధాకరం

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర అయినా ఆదివాసి కోయల,ప్రతీక సమ్మక్క సారక్క ల మహా జాతర దగ్గర పడుతున్న ఇంకా ప్రాజెక్ట్ అధికారిని,నియమించకపోవడనికి గల కారణం ఏమిటో!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ లను మరియు ఏఎస్పి లను నియమించాలి కానీ ములుగు జిల్లా లో వేండ్లు గడుస్తున్నా శాశ్వత ఐఏఎస్ ఐపీఎస్ లను నియమించడం లేదు. తక్షణమే శాశ్వత ఐఏయస్ లు అయినా సబ్ కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారులను నియమించాలని ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.ఏటూరునాగారం పీవో ను నియమించ కుండా ములుగు జిల్లా కలెక్టర్ కు ఇంచార్జ్ ఇవ్వడం వల్ల ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుందని అయినా ప్రభుత్వం పట్టించుకోకుండ వ్యవరస్తుందని అన్నారు.

 ఓట్లకోసం ఆదివాసీల అభివృద్ధి కోసం పాటు పడతామని హామిలిచ్చారని, గెలిచాక ఎంపీ,మంత్రి,జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ లు ఒక్కరు కూడా ఆదివాసీలా సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు గతంలో డి.ఎల్.సి సమావేశలలో మేడారం జాతర వర్క్ లు విడిసి ల పేరిట ఇస్తానని చెప్పి ఇప్పుడు పెత్తందారులకు బడా కాంట్రాక్టర్ లకు ఈ ప్రభుత్వం కొమ్ము కస్తూ  ఇవ్వడం.జరుగుతుందని,ఇకనైనా ప్రభుత్వ విధానాలు మార్చుకావాలని అని అన్నారు.ఏటూరునాగారం ఐటిడిఎ పివో గా ములుగు సబ్ కలెక్టర్ ను నియమించాలని అన్నారు.ఆందోళనలు చెపడతామని రాష్ట్ర ప్రభుత్వనికి తుడుందెబ్బ పక్షన డిమాండ్ చేస్తున్నాం అని  అన్నారు.మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్,డైరెక్టర్ లు మేడారం స్థానిక ఆదివాసీలకే ఇవ్వాలని,పోడు భూములకు దరఖాస్తు లు గడువు పెంచాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమనికి ఏఎస్ యు రాష్ట్ర కో కన్వినర్ సిద్దబోయిన శ్యాం కుమార్,తాడ్వాయి మండల అధ్యక్షులు మోహన్ రావు,మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్, వికాస్,కార్తీక్,సిద్దబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: