CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ప్రభుత్వ ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం.

Share it:

 # 19-11-2021(శుక్రవారం)

# ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌

# పినపాక మండలం 


#రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ# 


-  

- 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతులకు శుభసూచికం 

- త్వరలోనే పోడుభూములకు పట్టాలు 

- దేశ వ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలి 

- టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి 

మన్యం టీవి,పినపాక : 

దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ పార్టీ పోరాటాల ములంగానే పరిష్కారం లభించిందని, అందులో భాగమే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు...  ఆయన మాట్లాడుతూ.... 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టి రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు రైతులకు అనుకూలంగా రైతుబంధు అందించడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేశామన్నారు. అదేవిధంగా గోదావరిపై అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అందులో భాగమే కాలేశ్వేరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణాలు చేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకవచ్చిన మార్పుల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా వరిసాగు అధికంగా చేశారన్నారు. దీంతో దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేక కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో తెలంగాణ సీఎం నిన్న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించి రైతుల పక్షాన నిలిచారన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు పండించిన పంటలను రైతుల ఇష్టం మేరకు కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పోరాటానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. అదే విధంగా త్వరలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  పోడుసాగుదారులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌సీ కమిటీల ఏర్పాటు, పోడుసాగుదారులకు అవగాహన సదస్సులు, గ్రామ సభల ద్వారా ధరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, అతి త్వరలోనే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  చొరవతో పినపాక  నియోజకవర్గం నుండే పోడుభూములకు పట్టాల మంజూరు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. దీంతోపాటు బీసీ కుల గణన కూడా వెంటనే చేపట్టాలని లేని ఎడల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు బొలిశెట్టి నర్సింహారావు, దాట్ల వాసుబాబు, పోలిశెట్టి సత్తిబాబు, రాయల సత్యనారాయణ,సొసైటీ డైరెక్టర్‌ పొనుగోటి కామేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యాంపాటి సందీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: