CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మినీ టీచర్ ను మెయిన్ టీచర్ గా గుర్తించాలి : సి ఐ టి యు

Share it:



మన్యం టీవీ ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 

9 సంవత్సరాలుగా మినీ అంగన్ వాడీ  చూస్తున్న ఈ ప్రభుత్వం మెయిన్ టీచర్ గా గుర్తించాలని సిఐటియు మండల కన్వీనర్ ఆలేటి కిరణ్ పేర్కొన్నారు. సోమవారం  ఐసిడిఎస్, సిడిపిఓ కార్యాలయం ముందు మినీ అంగన్ వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆలేటి సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ..మినీ టీచర్ గా ఉంటూనే ఓ వైపు వంట చేస్తూ, మరోవైపు టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఇప్పటికీ వారి వేతనాలు పెంచకుండా ఇతర పనులు  వ్యాక్సిన్ పని  బూత్ లెవెల్ ఆఫీసర్ డ్యూటీలు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.  ఈ ప్రభుత్వాలు పని ఒత్తిడిని పెంచుతూనే అధికారులు  భయపడుతూ పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే బూత్ లెవెల్ ఆఫీసర్ డ్యూటీ వ్యాక్సిన్ డ్యూటీ రద్దు చేయాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దె, గ్యాస్ బిల్లు ఇవ్వాలని వీటితో పాటు పెంచిన పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని సి సి. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ నాయకురాలు కల్లేపల్లి మరియ, అరుణ,సుజాత, దేవమణి, బి.అరుణ,సుశీల, నాగమణి, మాధవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: