CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం పినపాక మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి. పలు కుటుంబాలను  పరామర్శించారు. అదే విధంగా పలు గ్రామాల్లో శుభ కార్యాలలో పాల్గొన్నారు. సీతారాంపురం సర్పంచ్‌ నాలి మహేష్‌ ఇంటి వద్ద గ్రామస్థులతో మాట్లాడారు.

గ్రామంలో అంగన్‌వాడీ పాఠశాల, పంచాయితీ కార్యాలయం మంజూరు చేయాలని, గ్రామస్థులు కోరారు. అదేవిధంగా పోడుసాగుదారులకు పట్టాలు ఇప్పించాలని సీతారాంపురం గ్రామస్థులు ఎమ్మెల్యే ను కోరారు. ఏడూళ్ల బయ్యారం గ్రామం ఈనాడు విలేకరి భాస్కర్  తండ్రి బుహ్యవరపు గోపాల్ స్వామి (75) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. పినపాక వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి  ఆ కుటుంబానికి 50kgల బియ్యం వితరణగా అందజేశారు.  గుదే వెంకటేశ్వర్లు (36) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన గుమ్మాల మహాలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న వారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.పచ్చి పులుసు ఆంజనేయులు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించడం జరిగింది..

కల్తీ కృష్ణ వాహనం మీద నుంచి కింద పడిపోవడంతో, తీవ్రగాయాలు కావడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

 విప్పలగుంపుకు చెందిన ఎల్ల బోయిన సమ్మయ్య (90) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడం తో వారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

జానంపేట పున్నెం రాములు (90) ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులును పరామర్శించి మృతుడు చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.

 ముకుందాపురం డబ్బుల రాము కుమార్తె డబ్బుల సాయి దీప్తి (15) ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో వారి నివాసానికి వెళ్లి మృతురాలు చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. భూపతిరావుపేట గ్రామానికి చెందిన నల్లగొండ పుల్లయ్య (50) ఇటీవల కొన్ని రోజుల క్రితం గోదావరిలో గల్లంతు కావడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.జానంపేట కొత్త గుంపుకు చెందిన కందుల శేషగిరి ఇటీవల గుండె ఆపరేషన్ చేసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

దుగినేపల్లి  పోకరాజాపతిరాజు కుమారుడి రిసెప్షన్‌ కార్యక్రమంలో పాల్గొని నూతన వదూవరులను ఆశీర్వదించారు. సాయిని సమ్మయ్య  ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

దుగినేపల్లి ఎంపీటీసీ ఎగ్గడి ఉమాదేవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: