CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జానంపేట పాఠశాల ఉపాధ్యాయుని గురించి పై అధికారులకు విన్నావించాను.తదుపరి చర్యలు డి ఈ ఓ తీసుకుంటారు.-:చరవాణి ద్వారా తెలియజేసిన ఎంఈవో వీరాస్వామి.

Share it:

 







మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 

జి . బావ్ సింగ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిపై  అసభ్యకర పదజాలం ఉపయోగించడం, వారిని దుర్భాషలాడటం అనే విషయం గురించి మండల విద్యాధికారి వీరస్వామి ని "మన్యం మనుగడ" వివరణ కోరడం జరిగింది. ఈ విషయమై స్పందించిన మండల విద్యాధికారి వీరస్వామి జానంపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న భావ్ సింగ్ పై వచ్చిన ఆరోపణల గురించి అన్ని విషయాలు సేకరించి జిల్లా విద్యాధికారి అయిన సోమశేఖర శర్మ కు తెలియజేయడం జరిగింది అని, తదుపరి బావ్ సింగ్ గురించి, జిల్లా విద్యాధికారి ద్వారా విచారణ జరిగే అవకాశం ఉందని తెలియ చేయడం జరిగింది.

గతంలో 2018 కాలంలో పలువురు విద్యార్థులపై అసభ్య పదజాలం ప్రయోగించినందుకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియ చేశారని, ఈ విషయము ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని 

ఎం ఈ ఓ వీరస్వామి తెలియచేశారు. ఆ సమయంలో బావ్ సింగ్ రాతపూర్వకంగా క్షమాపణలు రాసి పాఠశాల హెచ్ఎం వీరమ్మ కు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

దీన్నిబట్టి ఒక విషయం అర్థమవుతుంది,   ఇంతకు  పూర్వమే బావ్ సింగ్ ప్రవర్తన తెలిసినప్పటికీ, ఉపాధ్యాయులు కప్పిపుచ్చడం, కేవలం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడం మాత్రమే జరిగింది. ఇప్పటికైనా ఈ విషయం గురించి జిల్లా విద్యాశాఖ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి, అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Share it:

TS

Post A Comment: