CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతులకు శుభసూచికం--:.టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం:

దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ పార్టీ పోరాటాల ములంగానే పరిష్కారం లభించిందని,అందులో భాగమే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అన్నారు. 

శుక్రవారం కరకగూడెం మండల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావుల సోమయ్య మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం జరిగిందని అన్నారు.దీంతోపాటు రైతులకు అనుకూలంగా రైతుబంధు,రైతు భీమా అందించడంతో పాటు సకాలంలో విత్తనాలు,ఎరువులు సరఫరా చేశామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన 3 చట్టాలను రద్దు చేయడం రైతులకు శుభసూచికం అని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌సీ కమిటీల ఏర్పాటు,పోడు సాగుదారులకు అవగాహన సదస్సులు,గ్రామ సభల ద్వారా ధరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు.అతి త్వరలోనే ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో పినపాక  నియోజకవర్గ నుండే పోడుభూములకు పట్టాల మంజూరు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు.దీంతోపాటు బీసీ కుల గణన కూడా వెంటనే చేపట్టాలని లేని ఎడల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొంపెళ్ళి పెద్ద రామలింగం,కొమరం రాంబాబు,పోగు వెంకటేశ్వర్లు,చిట్టి సతీష్,యాలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,దాసరి సాంబయ్య,యూత్ ప్రధాన కార్యదర్శి దిలీప్,రవి,అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: