CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేపు... నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వైకుంఠ ధామం ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేయనున్న ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


  • రేపు... నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వైకుంఠ ధామం   ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేయనున్న ఎమ్మెల్యే సీతక్క
  • సకల వసతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వర్గధామం

మన్యం టీవీ ,మంగపేట:

 ములుగు ఎమ్మెల్యే సీతక్క మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో మణుగూరు హీరో షోరూం యజమాని నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి తమ కుమారుడు కీర్తిశేషులు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిట నిర్మించిన వైకుంఠ ధామం ని లాంఛనంగా మంగళవారం ప్రారంబించి అకినేపల్లి మల్లారం గ్రామ ప్రజలకు జాతికి అంకితం చేయనున్నారు. అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన వైకుంఠధామం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎస్టీ కాలనీ గ్రామంలో నిర్మించడంతో గ్రామంలో వైకుంఠధామం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గ్రామస్తుల సమస్యను గుర్తించిన దాతలు నాసీరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి 30 కుంటల స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతోపాటు వైకుంఠధామం అభివృద్ధికి సుమారు రూ పధి లక్షలు వెచ్చించారు కాగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్  డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో  తన మాతృమూర్తి నాసిరెడ్డి చిట్టెమ్మ జ్ఞాపకార్థం 12 కుంటల స్థలాన్ని మరియు రూ లక్ష  నగదును విరాళంగా వెచ్చించారు గోదావరి నదీ తీరం వెంట వీరు ఇరువురూ కలిసి రూపాయలు 20 లక్షల విలువైన ఎకరం స్థలాన్ని స్వర్గధామం కి విరాళంగా అందించడం విశేషం అంతేకాకుండా నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిట నిర్మించిన స్వర్గధామం లో రహదారుల నిర్మాణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కళాతోరణం నిర్మాణం శివుడు నంది విగ్రహాలు ఏర్పాటు దహన వాటిక నిర్మాణం గేట్ల ఏర్పాటు మొదలగు పనులు పూర్తి చేశారు అంతే కాకుండా వైకుంఠ దామానికి అనుసంధానంగా గతంలోనే రూపాయలు లక్షతో సీతల శవపేటిక సైతం సమకూర్చారు  వైకుంఠధామం చుట్టూ పచ్చని చెట్లతో హరితహారం మొక్కలు పెంచుతున్నారు కాగా నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈనెల తొమ్మిదో తేదీన ములుగు ఎమ్మెల్యే సీతక్క వైకుంఠధామం ప్రారంబించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లోగో ను ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించనున్నట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్  డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి  మరియు వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి  విజయభాస్కర్ రెడ్డి లు తెలిపారు ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అకినేపల్లి మల్లారం గ్రామ ప్రజలు అందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: