CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజాకవి కాళోజీ సేవలు మరవలేనివి

Share it:


మన్యం టీవీ మంగపేట.

పుట్టుక ,చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణా ప్రజలకు అంకితం చేసిన మహనీయులు,తెలంగాణా వైతాళికుడు మనప్రజాకవి కాళోజీ సేవలు తరతరాలు మరువలేనివని ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్ర‌జాక‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు 19వ వ‌ర్ధంతి ఘ‌నంగా జ‌రిగింది.ఈసందర్భంగాములుగు జిల్లా మొట్టమొదటి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి  కుసుమ జగదీష్ కాళోజీ చిత్ర పటానికి పులమాల

వేసి నివాళుల‌ర్పించారు. 

ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్పయోధుడు అని ఆయన అభివర్ణించారు.తెలంగాణ ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమని తెలిపారు.

పుట్టుక, చావులు కాకుండా బతుకంతాతెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, ములుగు నియోజకవర్గ నాయకులు,మేధావులు,కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: