CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పులి గురించి ఆందోళన వద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Share it:

 



  • గోపాలరావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం నిజమే
  • అటవీ శాఖ వారికి సహకరించండి
  • ఉదయం నుండి రాత్రి వరకు అడవిలోనే గడుపుతున్న అటవీశాఖ సిబ్బంది
  • జాతీయ జంతువు పులిని కాపాడుకోవడం మన బాధ్యత
  • ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి - తేజస్విని


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గోపాల రావు పేట అటవీ ప్రాంతంలో పులి తిరుగుతుంది అన్న విషయము నిజమేనని ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్విని ధ్రువీకరించారు. పులి అడుగు లకు సంబంధించిన జాడలను గోపాలరావుపేట, చింతలపాడు గ్రామాల మధ్య గల కుంటలలో గుర్తించామని, అడుగుల ఆధారంగా పులి జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని, తెలియజేశారు. పులికి సంబంధించిన ఆనవాళ్ళు ఎవరికైనా కనిపించినట్లయితే అటవీశాఖ వారికి తెలియజేసి సహకరించాలని కోరారు. పులి జాతీయ జంతువు అని, కాపాడుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ జంతువులు అంతరించిపోయినట్లయితే, పర్యావరణ అసమతుల్యత  (ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్) ఏర్పడి అడవులు అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. వ్యవసాయ పొలాలలో వలలు, కరెంట్ లాంటివి అమర్చకూడదని తెలియజేశారు. జాతీయ జంతువు అయిన పులికి హాని తలపెట్ట డానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మాతో పాటు మా సిబ్బంది అంతా ఉదయం నుండి రాత్రి వరకు అడవి ప్రాంతంలోనే ఉండాల్సి వస్తుంది అని, ఈ విషయమై ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


Share it:

TS

Post A Comment: