CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కావడిగుండ్ల లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Share it:


 మన్యంటీవి, అశ్వారావుపేట: అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కావడిగుండ్లలో అమరవీరుడు పుల్లన్న వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. పుల్లన్న స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసం బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన అమరవీరుల సభలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కంగాల కల్లయ్య మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను హరించి వేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఇటువంటి ప్రభుత్వాలకు ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కుంజా భీమయ్య, కణితి జోగారావు, సర్పంచ్ కంగాల భూలక్ష్మి, తెల్లం లక్ష్మి, మడకం పాపారావు, సోడెం లక్ష్ముడు, వాసం పోతురాజు, కణితి జగ్గారావు, కంగాల నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ మడివి నాగేశ్వరరావు, వార్డ్ మెంబర్ కొమరం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: