CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్య అభిమన్యు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్థానిక  ఎస్టి గర్ల్స్ హాస్టల్ భారత విద్యార్థి ఫెడరేషన్ ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం విద్యార్థుల ప్రమాణాల పెంపు, డ్రాపౌట్ సమస్యలు కొని తెచ్చే విధంగా ఉందని వాపోయారు. తమ రాజకీయ ,సాంస్కృతిక భావజాల వ్యాప్తి లేతమనసులు పై, హృదయాలపై నాటాలని ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ఉంది అన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ,ఆల్ ఇండియా కౌన్సీల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్,అల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇలాంటి సంస్థలు రద్దుచేసి ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికార వికేంద్రీకరణ చేసే రాజకీయ ఆధిపత్యానికి తీసుకుంటున్నారని అన్నారు. ఇటువంటి విద్యా విధానం  భారత రాజ్యాంగానికి, లౌకిక పద్ధతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేసి నూతన విద్యా విధానం రద్దు చేయాలని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ పట్టణ నాయకులు అజ్మీర,  తరుణ్, మాధవి, సుధా, కృష్ణవేణి, వనజ, జాను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: