CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ పోరాట యోధుడు భీర్సా ముండా జయంతి వేడుకలు

Share it:

 


మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి


  • సంగం నాగరాజు


 ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) ఆధ్వర్యంలో  లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో భగవాన్ భీర్సా ముండా జయంతి ఘనంగా నిర్వహించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ లోని ఉలిహతు లో 1875 నవంబర్ 18 న జన్మిచారాని, భీర్సా ముండా  తెల్ల దొరలపై తిరుగుబాటు చేసి వారు దేశం వదిలి వెనక్కి పోవాలి అని,  తెల్ల దొరల వలస వాదం పై తిరుగుబాటు మొదలు పెట్టి భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మొట్ట మొదటి వ్యక్తి అని అన్నారు. అక్కడి ఆదివాసీ ప్రజలను ఐక్యం చేసి భూమి శిస్తూ మాపి కోసం తెల్ల దొరల పై ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభించి పోరాటం కొనసాగించారని, ఆయన పోరాట ఫలితంగానే కౌలు చట్టం వచ్చిందని అన్నారు.ఆదివాసీ సంసృతి సంప్రదాయాల కాపాడేందుకు మాత మార్పిడి చేసే క్రైస్తవ మిషనరీలకు ఎదురించు పోరాట సాగించిన గొప్ప ఆదివాసీ పోరాట యోధుడు అని కొనియాడారు. భీర్సా ముండా జయంతి రోజును కేంద్ర ప్రభుత్వం *"జాతీయ ఆదివాసీ దివస్ "* గా ప్రకటించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లక్ష్మీదేవిపల్లి  మండల నాయకులు వర్స నరసింహా రావు, పాయం లక్ష్మీ నర్సు, లక్ష్మిపురం సర్పంచ్ వర్స  వసంతరావు, బొజ్జలగూడెం సర్పంచ్ జోగ బక్కయ, కుర్సం రమేష్, కోరం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: