CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బూర్గంపాడు మండలం కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:



  •  కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ.
  •  టీఆరెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
  •  దేశంలోనే సీఎం కేసీఆర్  నాయకత్వంలో ఎదురులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీ
  •   

మన్యం టీవి, బూర్గంపాడు:


దేశంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్  నాయకత్వంలో ఎదురులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీఅవతరించింద ని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.ఆయన గురువారం బూర్గంపాడు మండలం కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని  ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదల అభివృద్ధి కి, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు...

 పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

 రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు అయినా అన్నారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీ నిలిచింది అని ఆయన తెలిపారు.

 రానున్న రోజులలో రాష్ట్ర అభివృద్ధి మరోవైపు ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.

💥💥💥💥💥💥💥💥

 అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక...

💥💥💥💥💥💥💥💥

 టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, బూర్గంపాడు మండలానికి చెందిన స్థానిక యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు  వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 టిఆర్ఎస్ పార్టీ ని నమ్మి చేరిన వారికి అన్ని విధాల తాము అండగా ఉంటామని పేర్కొన్నారు.

 కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.

🙏🙏🙏

 రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో ఆర్థిక సాయం.


డయాలసిస్ తో బాధ పడుతున్న  పోతోజు సతీష్ కి  వైద్య ఖర్చుల నిమ్మితం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది వేల రూపాయల చెక్కును  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే ,ట్రస్ట్ చైర్మన్  రేగా కాంతారావు బాధితుడికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: