CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పత్తి రైతులపై దళారుల పంజా పట్టించుకోని అధికారులు అడ్డికి పావుశేరు అన్న చందంగా మారిన వైనం..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోనీ పత్తి కొనుగోలు ఉప మార్కెట్ లో చిన్న, సన్నకారు పత్తి  రైతులపై కొంతమంది దళారులు కొనుగోలు రేటులో కోతల పంజా విసురుతున్నారు. ప్రతిరోజు జండా పాటతో మొదలయ్యే వ్యాపారం, అనంతరం వందల మంది రైతుల లో ఏ ఒక్క రైతుకు జెండా పాట ధర దక్కకపోవడం ఇక్కడి విశేషం. రైతు తమ పంటను మార్కెట్ కు తీసుకు పోవడమే ఆలస్యం చుట్టుముట్టిన వ్యాపారులు ఒక రేటుకు కొనుగోలు చేసి, పత్తిని సగం దిగుమతి చేసిన తరువాత అనేక కారణాలు చూపి కొనుగోలు రేటు లో కోతలు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. క్వింటాల చొప్పున తారం తియాల్సి ఉండగా, బస్తాల వారిగా తారం తీసి రైతు పంటకు కోత పెడుతున్నారు. ఎన్నో ఆశలతో ఆరుగాలం చాకిరి చేసి చివరకు అంగడికి పోతే అడ్డీకి పావుచేరు అన్నచందంగా మా పరిస్థితి మారిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాలపై మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ మార్కెట్ కి దూర ప్రాంతాల నుండి పత్తిని అమ్ము కొనుటకు రైతులు నిత్యం వస్తుంటారు. క్రయ విక్రయాలు ఇక్కడ నుండే అధిక మొత్తంలో జరిగినప్పటికీ, ప్రజా అవసరాల దృష్ట్యా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, మార్కెట్ అధికారులు, మార్కెట్ పాలకవర్గం పట్టించుకొని, దళారుల ఆటలను కట్టించి రైతులకు న్యాయం చేయ్యాలని కోరుతున్నారు. జూలూరుపాడు ఉప మార్కెట్లో రైతులపై జరుగుతున్న దోపిడిని, త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నట్లు కొందరు రైతులు మన్యం టీవీకి తెలిపారు.

Share it:

TS

Post A Comment: