CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి -బిజెపి జిల్లా ఇన్చార్జి రాకేష్ రెడ్డి.

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట:జిల్లా వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నానని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు నియోజకవర్గంలో బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా నిలిపేందుక తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో అశ్వారావుపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ జిల్లా ఇన్చార్జి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ స్తబ్దత నెలకొందని, టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని బిజెపి భర్తీ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కొంచెం బలహీనంగా ఉందని, ఆ లోటును పూడ్చేందుకు తాను జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అశ్వారావుపేట మండలం లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ బలోపేతానికి మండల స్థాయి నాయకులు, కార్యకర్తల నుండి విలువైన సూచనలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్రంలో కేసీఆర్ పాలన గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల కిలోమీటర్లు రహదారులను కేంద్రం నిర్మించిందని, హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలయ్యే ప్రతి సంక్షేమ పథకానికి కేంద్ర ప్రభుత్వం మెజారిటీ నిధులు ఇస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సొమ్మొకడిది సోకొకడిది అన్న చందాన వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాన మోడీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే అమలు చేయకుండా రాష్ట్ర శనిలా దాపురించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు సంధించారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకాన్ని అమలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం ఆయుష్మాన్ భవ పథకంలో భాగంగా కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్తా తాడోపేడో తేల్చుకుంటా అని రాష్ట్రంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రగల్భాలు పలికే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దండాలు పెడతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు లేదని, రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగిస్తూ కుటుంబసభ్యులకు పదవులు పంచుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ కు ప్రధాని మోడీని విమర్శించే స్థాయి లేదని అన్నారు. వడ్లు కొనుగోలు విషయంలో కూడా కేసిఆర్ డ్రామాలు చేస్తున్నారని, కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మెట్ట వెంకటేష్, నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్య ప్రసాదరావు, నియోజకవర్గ కన్వీనర్ బండి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సొలస పుష్కర కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్వీటి కొండ, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చల్లా నిరంజన్ దాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రదీప్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రావి క్రింది కుమార్ రాజా, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు నరాల గంగారత్నం, సీనియర్ నాయకులు గొట్టపు అప్పారావు, కలకోటి కృష్ణారావు, శివ కుమార్, మానేపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: