CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జేఈఈ ర్యాంకు సాధించిన ఆదివాసి చదువుల తల్లికి ఆర్థిక సహాయం.

Share it:

 


  • ములుగు జిల్లా టిఆర్ఎస్ నాయకులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణ్ బాబు) 20 వేల రూపాయల ఆర్థిక సహాయం.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన దబ్బ గట్ల సమ్మక్క,ఇటీవల కాలంలో జే ఈ ఈ మెయిన్స్ లో ఎస్టి కేటగిరి లో 4165 ర్యాంకు సాధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్ పూర్ లో మైనింగ్ డిపార్ట్మెంట్ లో సీటు సంపాదించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమ్మక్క కు ములుగు జిల్లా టిఆర్ఎస్ నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రం వాసి ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణ్ బాబు)సహకారంతో 20 వేల రూపాయలను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆదిమ తెగలు 74 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఉన్నత చదువులలో సీటు సంపాదించడమే కష్టతరం అయ్యే క్రమంలో వచ్చిన సీట్ ను ఆర్థిక స్తోమత లేక కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. అందుకే ఈ విషయం తెలుసుకున్న స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ బాబు విషయం తెలియగానే వెంటనే స్పందించి అడ్మిషన్ ఫీజు కోసం 20 వేల రూపాయలను అందజేశారు.అలాగే ప్రభుత్వం పరంగా కూడా సాయం అందేలా చేయనున్నట్లు తెలిపారని అన్నారు.ఆదివాసీ విద్యార్థి సమ్మక్కకు ఆర్థిక సహాయం అందించిన లక్ష్మణ్ బాబుకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానమని అరుణ్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాష్, మండల అధ్యక్షులు ఈసం రాజు,పీరీల సురేష్,కుర్సం వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: