CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకై గోవిందరావుపేట మండల సమన్వయ కమిటీల ఏర్పాటు--:ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి.

Share it:



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసపుత్ సీతారాంనాయక్ అధ్యక్షతన,మండల ఇంఛార్జి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్  ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ.గోవిందరావుపేట మండల డిజిటల్ సభ్యత్వ నమోదు చేయించడానికి సమన్వయ కమిటీలను నియమించారు.ములుగు నియోజకవర్గంలో 302 పోలింగ్ భూతులు ఉన్నాయని,మండల అధ్యక్షులు చొరవ తీసుకుని భూతు కమిటీలు వేయాలని,  ప్రతి భూతుకు ఒక కన్వీనర్, ఒక సోషల్ మీడియా ఇంఛార్జి మరియు ఒక ఆపరేటరును ఎంపిక చేయాలి అని,ఎంపిక చేసిన జాబితా ఈ నెల 20 వరకు నాకు పంపించాలని అన్నారు.అలాగే ప్రతి భూతు నందు 100 మందికి తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయించాలని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద భీమా 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ సభ్యునికి వర్తింపజేస్తుంది అని అన్నారు.కావున మండల అధ్యక్షులు వెంటనే చొరవ తీసుకుని,బూత్ కమిటీలు వేసి,సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.అలాగే గోవిందరావుపేట మండల సమన్వయ కమిటీ సభ్యులుగా 

పన్నాల ఎల్లారెడ్డి,రసపుత్ సీతారాంనాయక్,పాలడుగు వెంకటకృష్ణ,జెట్టి సోమయ్య,

ముద్దబోయిన రాము,కుర్సం కన్నయ్య,తేళ్ల హరిప్రసాద్ 

జంపాల ప్రభాకర్ లను ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మండలంలోని బూత్ లన్నిటిని పర్యవేక్షిస్తూ భూతుల వారిగా సభ్యత్వ నమోదు చేయించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి,ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తి రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు,బద్దం లింగారెడ్డి, కంటెం సూర్యనారాయణ, అలుగుబెల్లి కన్నయ్య, సోమసాని నారాయణ స్వామి, మట్ట వెంకటపాపి రెడ్డి,శేఖర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: