CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాణ్యమైన విద్య తో పాటు రుచికరమైన భోజనం అందించండి--:జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

గిరిజన సంక్షేమ,ఆశ్రమ పాఠశాలల ప్రత్యేక అధికారులతో  క్షేత్రస్థాయిలో ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని, నాణ్యమైన పోషక విలువలతో కూడిన మెనూ అందించడంలో రాజీ పడేది లేదని,విద్యా ప్రమాణాలు మెరుగు పడాలని జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య  అధికారులనుఆదేశించారు.మంగళవారం రోజున ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి విధుల్లో భాగంగా ఐటీడీఏ కార్యాలయానికి విచ్చేసి  ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఎ గిరిజన విద్య సంక్షేమం పాఠశాలల్లో మౌలిక వసతులు పరిసరాల పరిశుభ్రత,ప్రతిరోజు ఆన్లైన్లో హాజరు శాతం, విద్యార్థినీ విద్యార్థులకు టెస్ట్ బుక్స్,నోట్ బుక్స్ సరఫరా,సంబంధిత విషయాలపై ములుగు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పై ప్రత్యేక అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ మన జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతం గిరిజన విద్యా సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తుందని, గిరిజన విద్యార్థిని విద్యార్థులు కరోనా వ్యాధి కారణంగా పాఠశాలలో మూతపడి విద్యార్థినీ విద్యార్థులు సరైన పౌష్టికాహారం తీసుకోక రక్తహీనతకి గురి అవుతుంటారు.మన పాఠశాలకు వచ్చిన వెంటనే మంచి పౌష్టికాహారం అందించాలన్నారు.గిరిజన సంక్షేమ విద్యా ప్రమాణాలు మెరుగు పడాలంటే గిరిజన సంక్షేమ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ అన్నారు.ప్రతి గిరిజన విద్యార్థి తమ సొంత పిల్లల వలె భావించి విద్యా బోధన పై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతిరోజు పాఠశాలల వారీగా విద్యార్థుల హాజరు శాతం 9:40 నిమిషాలకు తీసుకొని ప్రతిరోజూ 10 గంటల వరకు ఆన్లైన్ అటెండెన్స్ షీట్ పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు.టీచర్లు స్టడీ అవర్,స్పెషల్ క్లాసులు,మెనూ అమలు చేయు మెనూలో చికెన్ అందించాలని ప్రతి పాఠశాలలో ఏఎన్ఎంలు ఉండాలని, పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించాలని,నిత్యవసర వస్తువులు స్టాక్ మెయింటెన్ చేయాలని,పాఠశాలల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు స్టాక్ ఎంట్రీలు తప్పనిసరిగా నిర్వహించాలని ఇందుకు వసతి గృహ సంక్షేమ అధికారులు ఏటిడివో లు ప్రధాన ఉపాధ్యాయులు సమన్వయం చాలా అవసరమని అన్నారు.  డ్రాపౌట్స్ శాతం తగ్గించాలి అన్నారు.క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు అధికారి విధుల్లో భాగంగా పాఠశాలలను పరిశీలించినప్పుడు ఎటువంటి లోటుపాట్లు కనిపించినా సంబంధిత,ప్రధానోపాధ్యాయులు,వసతి గృహ సంక్షేమ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు.నిధులు కొరత లేదు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పాఠశాలలో ఆర్ వో ప్లాంట్స్,సీసీ కెమెరాల పనితీరు,టాయిలెట్స్ డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ ఏమైనా మరమ్మత్తులు ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి  వెంటనే అన్ని మౌలిక వసతులు సమకూర్చుకోవాలి అన్నారు.అన్నీ ప్రాపర్ గా మెయింటెన్ చేయాలని అధికారులకు హితబోధ చేశారు.అనంతరం శాఖల వారీగా ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను యూనిట్ అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో  వసంతరావు,ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య,ఇంజనీరింగ్ ఇ.ఇ హేమలత,ఏవో దామోదర స్వామి,వరంగల్ ,మహబూబాబాద్ ఆర్ సి ఓ లు  డిఎస్ జగన్,రాజ్యలక్ష్మి  మరియు ప్రత్యేక  అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: