CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండలం లో ప్రభుత్వ విప్‌ రేగా విస్తృత పర్యటన .

Share it:



  •  టి.కొత్తగూడెం సర్పంచ్‌ కనితి చిన్నక్క కి పరామర్శ
  • రెండు కిడ్నీలు దెబ్బతిన్న సాధనపల్లి అచ్చయ్య కు రూ.10వేల ఆర్ధిక వితరణ


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామంలో గురువారం తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  విస్తృతంగా పర్యటించారు. 

 ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో సొసైటీ వైస్‌ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.  టి.కొత్తగూడెం సర్పంచ్‌ కనితి చిన్నక్క అనారోగ్యంతో భాధపడుతుండగా ఆమెను పరామర్శించారు. అనంతరం అనారోగ్య సమస్యలతో భాధపడుతున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలైన 

 పూనెం నారాయణను, పరామర్శించారు. రెండు కిడ్నీలు దెబ్బతెన్న సాధనపల్లి అచ్చయ్యను పరామర్శించి, రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నుండి రూ. 10వేల రూపాయల చెక్కును అందజేశారు. 

 అదే గ్రామంలో వివాహా కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులైన మణికంఠ-కావ్యలను ఆశీర్వదించారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రవివర్మ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు,ఉడుముల లక్ష్మిరెడ్డి,పోలిశెట్టి సత్తిబాబు,రాయల బాబు, పటేల్ కామేష్, దినసరపు శ్రీనివాసరెడ్డి,  ఎంపీటీసీలు కాయం శేఖర్, పోలిశెట్టి హరీష్‌, ఎగ్గడి సత్యం, సర్పంచ్‌లు మొగిలిపల్లి నర్సింహారావు, బాడిశ మహేష్‌, మండల నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, బోడ ఈశ్వర్‌, బిల్లం సాంబశివరావు,  సోషల్‌మీడియా నియోజకవర్గ  అధ్యక్షులు యాంపాటి సందీప్‌ రెడ్డి, యూత్‌ అధ్యక్షులు గాండ్ల అశోక్‌, పాడి దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చెన్నకేశవులు, పాయం నరేష్ తదితరులు పాల్గొన్నారు...

Share it:

TS

Post A Comment: