CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బి టి పి ఎస్ రైల్వే లైన్ నిర్వాసితుల విషయంలో అధికార యంత్రాంగం వైఖరి గందరగోళం తప్పులను సరిచేయండి.--:న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి .

Share it:

 


  



  బి టి పి ఎస్ రైల్వే లైను కింద నివాసాలు స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులoదరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గతంలో లేఖలు తీసుకున్న వారితో కలిసి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మణుగూరు తాసిల్దార్ చంద్రశేఖర్ గారికి కొందరు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అనంతరం మోర రవి మాట్లాడుతూ గతంలో రెవెన్యూ శాఖ వారు సబ్ కలెక్టర్ గారికి తప్పుడు రిపోర్టులు పంపడంతో  తిర్లాపురం గ్రామ పంచాయతీ బెస్తగూడెంలో బి టి పి ఎస్ రైల్వే లైన్ కింద నివాసాలు అలాగే స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు అయిదారు కుటుంబాలకు రైల్వే లైన్ క్రింద వారి నివాసం గాని స్థలం గాని పోవడం లేదని సబ్ కలెక్టర్ గారి నుండి లేఖలు ఇచ్చారని అన్నారు కానీ ఈ మధ్యకాలంలో బి టీ పి ఎస్ కు సంబంధించిన రైల్వే లైన్ దిమ్మెలు నిర్మించిన విధానం చూస్తే సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఇచ్చిన లేఖల ప్రకారం అందులో పేర్కొన్న దానికి విరుద్ధంగా ఉందని అన్నారు వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి నివాసాలు స్థలాలు పోవడం లేదని లేఖలు ఇచ్చిన వారిని కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని కోరారు ఇప్పటికే రైల్వే లైను కింద నిర్వాసితులకు న్యాయబద్ధమైన ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు స్థలానికి 17000 రూపాయలు నివాసం కోల్పోయిన వారికి 80 వేల రూపాయలు చెక్కులు ఇచ్చారని ఇది ఎంత మాత్రం న్యాయబద్ధంగా లేదని అన్నారు స్థలాలు నివాసాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు మానాది వెంకటనరసయ్య పుప్పాల సైదులు మల్లికార్జున్ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: