CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమరారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆవు పై దాడి

Share it:

 



  • అమరారం గ్రామానికి చెందిన దాట్ల రమేష్, ముసలయ్య లకు చెందిన ఆవు మృత్యువాత
  • పినపాక మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసిన డిఎఫ్ ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయతీకి కూతవేటు దూరంలో గల జూదాల చెరువు సమీపంలో పులి ఆవును చంపిన ఘటన చోటు చేసుకుంది. అమరారం గ్రామానికి చెందిన దాట్ల రమేష్, దాట్ల ముసలయ్య అనే సోదరులు వారికిగల ఆవుల మందను తోలుకొని గ్రామాన్ని ఆనుకుని ఉన్న  అటవీ ప్రాంతంలో గల జూదాల చెరువు సమీపంలో మేపడానికి వెళ్లారు. ఉదయం 12 గంటల సమయంలో ఆవులు వేస్తూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అది గమనించిన సోదరులు ఏమిటా అని గమనించగా, పెద్ద పులి వారికి గల ఒక ఎర్ర దూడను మెడకు కరచి చంపి వేయడం జరిగింది. కొంత దూరం నుండి ఈ విషయాన్ని గమనించిన వారు భయంతో చెట్టు ఎక్కి కొద్ది సమయం తర్వాత, ఇంటికి బయలుదేరామని" మన్యం మనుగడ" కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అయిన డి ఎఫ్ ఓ లక్ష్మణ్  రంజిత్ నాయక్ , కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్, ఎఫ్ డి ఓ మణుగూరు వి. మంజుల, ఏడూళ్ల బయ్యారం అటవి క్షేత్ర అధికారి తేజస్విని, ఇతర సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృత జీవిగా పడి ఉన్న ఆవు దూడను గమనించడం జరిగింది.

ఈ సందర్భంగా డిఎఫ్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ మాట్లాడుతూ, పినపాక కరకగూడెం మండలాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలో మేత కొరకు జంతువులను తీసుకెళ్ళ వద్దని, ఎవరికైనా పులి కనిపించినట్లయితే అధికారులకు వెంటనే సమాచారం తెలియజేయాలని చెప్పారు.

Share it:

TS

Post A Comment: