CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భక్తులకు సకల సౌకర్యాలు.జాతర విజయవంతంకి కృషి చేయాలి.ప్రతిపాదనలు సిద్ధం చేయండి-:ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

Share it:

 

.



.  

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో  భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి జాతర విజయ వంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.మేడారం జాతర 2022లో బాగంగా ఈ సారి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో ఆ ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం పర్మినెంట్,సెమీ పర్మినెంట్ గా సౌకర్యాలు కల్పించి పర్మినెంట్ గా ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు తీసుకోవాలని జాతర ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.శనివారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మేడారం జాతర ప్రత్యేక అధికారులు మిషన్ భగీరథ ఇ.ఇ.లు,డిఈ లతో జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు,జాతర ప్రాంతాన్ని ప్రత్యేక అధికారులు పరిశీలించి  ప్రతిపాదనలు సిద్ధం చేసిన  నివేదికలను పరిశీలించి రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో మేడారం జాతర విజయ వంతంగా నిర్వహించుటకు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం కొరకు జాతర ప్రాంతంలో ఎక్కడైతే మౌలిక వసతులు ఎక్కదైతే అవరసం ఉన్నచో అక్కడ  క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక అధికారులు పరిశీలించి నివేదికలు అందించారని,అన్నారు.త్రాగునీరు,పరిసరాల పరిశుభ్రత కోసం బోర్ వెల్స్,హ్యాండ్ పంప్స్,టాయిలెట్స్,ఇన్ ఫీల్డ్ ట్రేషన్,డ్రింకింగ్ వాటర్ పరిసరాల పరిశుభ్రత లో భాగంగా సఫాయి కార్మికులు నియమించడం,మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్స్,సంబంధిత లొకేషన్స్ సెక్టార్,సబ్ సెక్టార్ వారిగా అడిగి తెలు సుకున్నారు. ప్రత్యేక అధికారులు ఎస్టిమేషన్ తయారు చేశారని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి టెండర్స్ కి వెళ్ళినప్పుడు ఏ రకంగా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందో సరిచూసుకొని టెండర్స్ ద్వారా పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా చూస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో రమాదేవి,మిషన్ భగీరథ ఈ ఈ మాణిక్యరావు,సంబంధిత ప్రత్యేక అధికారులు మిషన్ భగీరథ డీ ఈ లు,ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: