CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అటవీ హక్కు పత్రాలు దరఖాస్తులు రేపటికి చివరి రోజు

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

గిరిజన గిరిజనేతర ప్రజలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా  పోడు కల్టివేషన్ లో ఉన్న వారి భూములకు  అటవీ హక్కు పత్రాలు కొరకు  దరఖాస్తులు నిర్దేశిత గడువు తేదీ నవంబర్ ఆఖరి తేదీ 17 వ తారీకు సాయంత్రం లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

మంగళవారం ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ ములుగు జిల్లాలో పోడు కల్టివేషన్ లో ఉన్న వారి భూములకు అటవీ హక్కు పత్రాలు సంబంధిత విషయాలపై కలెక్టర్ మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ కమిటీ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఎన్నో ఏళ్ల గా ఎదురు చూస్తున్న గిరిజన గిరిజనేతర పోడు భూముల సమస్యలపై హక్కు పత్రాలు మంజూరు చేయాలని సదుద్దేశంతో ఈ  సువర్ణ అవకాశం కల్పించిందని,ఈ అవకాశాన్ని  అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.నివాస స్థలాలు అటవీ ప్రాంతంలో ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు నన్నారు.ఒకే వ్యక్తికి అదే గ్రామంలో మూడు చోట్ల భూమి ఉన్నా కూడా ఓకే దరఖాస్తుతో భూమికి సంబంధించిన మ్యాప్ ను జత చేస్తూ దరఖాస్తు సమర్పించవచ్చు అన్నారు. దరఖాస్తులు అందరి దగ్గర తీసుకుంటాము కానీ ప్రాసెస్ చేసేటప్పుడు చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

ములుగు జిల్లా లో ఉన్న గిరిజన గిరిజనేతర ప్రజలు వాడి పోడు భూముల దరఖాస్తులను ఆఖరు తేదీ నవంబర్ 17వ తారీకు సాయంత్రం లోపు ఏ గ్రామంలో అయితే భూమి ఉందో ఆ హ్యాబిటేషన్ లో ఉన్న ఎఫ్ ఆర్ సి కమిటీ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.ఇదే అదునుగా భావించి  కొత్తగా పోడు నరకడానికి ఎవరైనా చూస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Share it:

TS

Post A Comment: