CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తున్న ప్రధాని మోడీ:సరళీకరణ విధానాలతో ప్రభుత్వ రంగాలను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం.

Share it:

 



  • పోరాడి సాధించుకున్న పోడు భూముల చట్టాలను నీరు కారుస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య


మన్యం టీవీ మణుగూరు: నూతన ఆర్థిక విధానాలు కేంద్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తూ,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు.కనకయ్య అన్నారు.బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం పిట్టల. నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,సరళీకరణ విధానాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసి,ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మడం వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు అని అన్నారు.పోరాడి సాధించుకున్న పోడు భూముల చట్టాలను,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కారుస్తున్నాయి అని అన్నారు.కుల,ప్రాంతం భేదాలు చూడకుండా పొడు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.రైతులు సంవత్సర కాలంగా చేస్తున్న ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి,నల్ల చట్టాలను రద్దు చేసింది అన్నారు.రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నికల తర్వాత కెసిఆర్ ప్రభుత్వం రాజకీయ మైలేజీ కోసం రైతు దీక్షను చేపట్టారు అని అన్నారు.కానీ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారికి ఏమి న్యాయం చేశారని నిలదీశారు.రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.యాసంగి పంటకు ముందే పండించిన ఖరీఫ్ ధాన్యాన్ని,ఎవరు కొనాలో అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేయడం విడ్డూరమని అన్నారు.ఈనెల 26 తేదీన రైతు విజయ యాత్రను నిర్వహించాలని,డిసెంబర్ 1న మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి గొడిశాల. రాములు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల.లెనిన్, ఉప్పల.నరసింహారావు,నాయకులు నందం.ఈశ్వర్ రావు, మాచర పు.లక్ష్మణరావు, మేళక్కాల ఉత్తం,వై.నాగలక్ష్మి, మునిగల శివ,ప్రశాంత్,పల్లపు నాగేశ్వరరావు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: