CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనాల్సిందే

Share it:


👉పంజాబ్ రాష్ట్రానికి  న్యాయం! తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమా?

👉కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ,రైతులు బుద్ధి చెప్పడం ఖాయం

👉 అగ్ర రాష్ట్రాన్ని అంధకారం చేయొద్దు

👉మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

👉ఏడు మండలాల ప్రజాప్రతినిధులు,వందలాది రైతులు,టీఆరెస్ పార్టీ శ్రేణులు

మన్యం టీవి, మణుగూరు: కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం ధర్నా  కార్యక్రమానికి పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కాలినడకన మణుగూరు తాహశీల్దార్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ఆవరణ లో రైతులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ... అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ పారదర్శక పాలన తో దేశంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. ప్రజలందరికీ ఒకవైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని ఆదుకోవాలని సదుద్దేశంతో ఏడు సంవత్సరాల క్రితమే అనేక పథకాల రూపకల్పన చేసి నేడు రైతు రాజు చేయడం జరిగిందన్నారు. రుణమాఫీ, రైతు బంధు, నకిలీ ఎరువుల వ్యాపారులపై పీడీ యాక్ట్ వంటి  కార్యక్రమాలను అమలు చేస్తూ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నీటి గోస తీర్చి కోటి ఎకరాల మాగాణి గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం  తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసే విధంగా, ఆత్మ హత్య ల వైపు రైతుల దృష్టిని మరల్చే విధంగా  దుర్మార్గపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. పంజాబ్ రాష్ట్రంలో నూరుశాతం వరి ధాన్యం సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం,  తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపడం దారుణమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెచ్చుకొని రైతులు పండించిన ప్రతి గింజను వేసవిలో సైతం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల రైతుల చేతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. రైతులను నిర్వీర్యం చేసే నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని రేగా కాంతారావు డిమాండ్ చేశారు . కేంద్రం మెట్లు దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి అని అన్నారు. అనంతరం మణుగూరు తహశీల్దార్ చంద్రశేఖర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి  జిల్లా డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య,బూర్గంపాడు మార్కెట్ కమీటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ, మణుగూరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భద్రయ్య, జెడ్పిటిసి పోశంనరసింహారావు,పినపాక నియోజకవర్గ టీఆరెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, ఎంపీపీలు,  ,జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,పిఎసిఎస్ చైర్మన్లు , డైరెక్టర్లు ,రైతు సమన్వయ కమిటీలు ,మార్కెట్ కమీటీ డైరెక్టర్ లు,వివిధ మండలాల టీఆరెస్ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా అధ్యక్షులు ,యువజనవిభాగం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: