CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆహార పంటల సాగు పై ఆంక్షలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: న్యూడెమోక్రసీ డిమాండ్!

Share it:

 

 


  • వరి సాగు పై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలి  


మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ  ప్రతినిధి,


సంఘం నాగరాజు


  ఉన్నఫలంగా వరిపంట సాగు చేయొద్దనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆహార పంటల సాగు పై ఆంక్షలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం డివిజన్ నాయకులు మోర రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం పాల్వంచ రూరల్ మండలం ప్రభాత్ నగర్ గ్రామంలో అఖిలభారత రైతుకూలి సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకనుండి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోదని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర మంత్రులు మరియు ఐఏఎస్ అధికారులు ప్రకటనలు చేస్తున్నారని ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రకటనలతో రైతాంగం అయోమయానికి భయాందోళనకు గురవుతున్నారని అన్నారు సరైన అవగాహన ప్రోత్సాహకాలు లేకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పడం సరైనది కాదని అన్నారు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశుపాండే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ రాష్ట్ర రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని దీనిని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి పూనుకుంటున్నదని దీనిపై రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో  బీజేపీ టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాల అమలులో భాగంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం లో భాగంగా రైతాంగానికి మరణశాసనంరాసి వ్యవసాయరంగాన్ని ఆహార ధాన్యాల పై ఆధిపత్యాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి జరుగుతున్న పరిణామాలేనని పేర్కొన్నారు రైతు  ప్రజా వ్యతిరేక చర్యలలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార పంటల సాగు పై ఆంక్షలు ఎత్తివేసి గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయాలని ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కొమ్ము కొమరయ్య కందాల బుచ్చిరెడ్డి నల్లబోతుల నాగయ్య తూము రాజాలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: