CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బిర్సా ముండా జయంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఏటూరు నాగారం సిఐ సట్ల కిరణ్ కుమార్

Share it:



మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా మంగపేట మండలము  బ్రాహ్మణపల్లి ప్రభుత్వ హైస్కూల్ లో వనవాసి కళ్యాణ్ పరిషత్ఆధ్వర్యంలో మంగపేట మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల క్రీడాకారులకు వాలీ బాల్ పోటీలు నిర్వహిచడం జరిగింది ఈ పోటీలకు ముఖ్య అతిధిగా ఏటూరునాగారం సిఐ సట్ల కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలోపాల్లోన్నారు,ఈసందర్బంగా సిఐ కిరణ్ కుమార్ బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు  జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి వాలీబాల్ క్రీడాలను ప్రారంభం చేశారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లడుతూ ఆటలు ఆరోగ్యాన్నిజీవితంలోఎదుగుదలకు ఉపయోగపడతాయని ఎ ఆటనైనా క్రీడా స్పూర్తితోనే ఆడాలని అన్నారు 

 బిర్సా ముండా స్వాత్రంత ఉద్యమంతో పాటు తన జాతి ప్రజల అభ్యున్నతికి ప్రతి క్షణం తపించేవాడు నేటి  గిరిజన యువత ఆయనను స్పూర్తిగా తీసుకోని అవకాశాల్ని అందిపుచ్చుకోని ఉన్నత స్థాయికి ఎదిగి తమ తోటి వారికి అభ్యున్నతికి కృషి చేయ్యాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర క్రీడా ఇంచార్జ్ కొమరం రఘుపతి మాట్లడుతూ  వనవాసీ కళ్యాణ పరిషత్ ఆదివాసీ ల కోసం పని చేస్తుందని 1952 సంవత్సరంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్ పూర్ లో బాలాసాహెబ్ దేశ్ పాండే జీ వనవాసి కళ్యాణ పరిషత్ ని ప్రారంభించారని నాటి నుండి నేటి వరకు దేశంలోని అన్ని రాష్ట్ర లలో కళ్యాణ పరిషత్ ఆదివాసీల అభ్యున్నతికి,కృషిచేస్తుందని,ముఖ్యంగా క్రీడా విభాగం,భజన కేంద్రం, ఆరోగ్య కేంద్రాలు,విధ్యర్ధి ఆవాస నిలయాలు,ఎకోపాద్యయ పాటశాలలు లాంటి పద్నాలుగు విభాగాలలో పని చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో 50 జట్లు,500 మంది క్రీడాకారులు పాల్గోన్నారని నిర్వాహకులు తెలిపారు 

ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ సట్ల కిరణ్ కిరణ్ కుమార్, వానవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర క్రీడా ఇంచార్జ్ కొమరం రఘుపతి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏటూరునాగారం ఖండ కార్యవహా ఇప్పలపెళ్ళి రమేష్, భారతీయ మజ్దూర్ సంఘ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు,బ్రాహ్మణపల్లి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జవహర్ లాల్, ఉపాద్యాయులు గొప్ప సమ్మారావు,రేగా పాపరావు,మంకిడి క్రిష్ణ, బండారి జగదీష్ తో పాటు వానవాసి కళ్యాణ పరిషత్ జిల్లా క్రీడా ప్రముఖ్ మట్టె సతీష్ గారు, మండల్ ప్రఖండ ప్రముఖ్ చౌలం సాయిబాబు,కల్తీ అశోక్ బాబు, పిఈటి లు కొమరం రవి , కొమరం నీరజ్ , మొలకం ప్రసాద్ , ఆలూరి వినోద్ తో పాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: