CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హరితహారం నర్సరీ లో మొక్కలు పెంచడానికి ఎర్ర మట్టి కరువు.....అడవిలోని ఎర్ర మట్టితోనే అటవీశాఖ నర్సరీలు ఏర్పాటు.

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం                                                                                                                    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్నికి నర్సరీలు ఏర్పాటు చేయడం మొక్కలు పెంచడం పెంచిన మొక్కలు గ్రామ పంచాయతీల వారీగా వివిధ ప్రాంతాలలోని పలు ప్రదేశాలలో రోడ్డుకు ఇరు  వైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభత్వం అధికారులుప్రారంభించారు.

ఇట్టి నర్సరీలలో మొక్కలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ అధికారులు నర్సరీలు ఏర్పాటు చేయాలని అట్టి పనులు చేయడంలో ఉన్నారు.అధికారులకు అటవీ శాఖ అధికారులు నర్సరీలకు ఎర్ర మట్టి ని తీసుకొని వెళ్లకుండా అడ్డుకున్నారు. దింతో గ్రామ పంచాయతీ వారు నర్సరీలలో మొక్కలు పెంచడంలో తీవ్రంగా ఇబ్బందులు 

ఎదుర్కొంటున్నారు.ఇదే అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నర్సరీలు ఏర్పాటు చేయడంలో ఎలాంటి అడ్డంకులు ఉండడం లేదు. గ్రామపంచాయతీ అధికారులు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడంలో అటవీశాఖ అధికారులు ఎర్రమట్టి తీసుకొని పోకుండా అడ్డుపడటoతో నర్సరీల ఏర్పాటు మొక్కలు పెంచడం కష్టంగా మారిందిని పలువురు పేర్కొంటున్నారు.అటవీశాఖ కు ఓ న్యాయం ఇతర శాఖలకు ఓ న్యాయమని పలు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఎవరు కూడా చెట్లను పెంచడం కోసమే కదా చెట్లను పెంచడం కోసం అడవిలో నుండి ఎర్రమట్టి తీసుకుని పోతుంటే అడ్డుకోవడం చూస్తే గ్రామాల అభివృద్ధి అడ్డు కోవడమే అవుతుందిని పలువురు వాపోతున్నారు.నర్సరీలలో మొక్కలు పెంచడం కోసం తప్పనిసరిగా అటవీ ప్రాంతంలో ఎర్ర మట్టి కి ప్రభుత్వo అనుమతులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: