CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ స్థానికులకు ఇవ్వాలి.

Share it:

 


  • ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ లు మొత్తం ఆదివాసీలకే ఇవ్వాలి.
  • గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి,ములుగు జడ్పీ చైర్మన్ స్పందించాలి.
  • తాడ్వాయి మండలం తుడుందెబ్బ మండల అధ్యక్షులు గౌర బోయిన మోహన్ రావు,ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్నాధ రావు డిమాండ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే జాతర,ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర మేడారం ట్రస్ట్ బోర్డు మరియు డైరెక్టర్ లు మొత్తం తాడ్వాయి మండలంలోని పరిసర గ్రామాలలోని ఆదివాసి స్థానికులకే ఇవ్వాలని తుడుందెబ్బ తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షులు గౌర బోయిన మోహన్ రావు,ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్నాధ రావు డిమాండ్ చేశారు.ఈ మహా జాతర ఇంకా మూడు నెలలే ఉన్నా ఇప్పటి వరకు జాతర ట్రస్టు బోర్డు చైర్మన్ డైరెక్టర్లను నియమించి కాకపోవడానికి గల ఆంతర్యం ఏమిటో అని అన్నారు.జాతర దగ్గర పడుతున్న ఇప్పటి వరకు ఐటీడీఏ లో ప్రాజెక్టు అధికారి నియమించకుండా జిల్లా కలెక్టర్ ను ఐటీడీఏ ఇన్ఛార్జి ప్రాజెక్టు అధికారిగా కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.జాతర ట్రస్ట్ బోర్డు ను పూర్తిగా ఆదివాసీల తోనే కమిటీ వేయాలని అధికారులు,ప్రజా ప్రతినిధులు పేసా చట్టం తీర్మానం అనుగుణంగా పని చేయాలని లేదంటే ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతామని అన్నారు.

Share it:

TS

Post A Comment: