CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సైబర్ నేరాలపై విద్యార్ధులకు అవగాహన.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్,ఐపిఎస్ ఆదేశానుసారం కరకగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మరియు ఆనంతారం జడ్పిఎస్ఎస్ స్కూల్ విద్యార్థులకి సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ

సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదు వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదు సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి తదితర అంశాల గురించి విద్యార్థిని, విద్యార్థులకి తెలియపరిచారు.

 ఈ కార్యక్రమంలో కరకగూడెం,ట్రైనింగ్ ఎస్ఐ పి. గణేష్ అర్ ఎస్ఐ పి. శ్రీకర్,కరకగూడెం జడ్పిఎస్ఎస్ ఇంచార్జి హెడ్ మాస్టర్ బి. లక్ష్మణ్,ఆనంతారం జడ్పిఎస్ఎస్ హెడ్ మాస్టర్ ఎమ్. రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: