CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట సోషల్ వెల్ఫర్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.--:ఎస్ ఎఫ్ ఐ మంగపేట బ్రాంచ్ డిమాండ్

Share it:




మన్యం టీవీ మంగపేట.


ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ,వారి యోగక్షేమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న

మంగపేటమండలకేంద్రంలో ని(గంపోనిగూడెం) "సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్" ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మండల ఎస్.ఎఫ్.ఐ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకలెక్టర్ కృష్ణ ఆదిత్య కు ఓ వినతి పత్రం ఇచ్చినట్లు ములుగు "భారత విద్యార్థి సమైక్య" (ఎస్.ఎఫ్.ఐ)  జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ తెలిపారు.మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా సోషల్ వెల్ఫర్ ఆశ్రమ బాలుర పాఠశాలలో  400 మంది విద్యార్థులు ఉంటే,నాలుగే టాయిలెట్స్ ఉండటం విద్యార్థులు తీవ్ర ఇబ్బంది,ఇక్కట్లు పడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ విద్యార్థులతో మేస్త్రి పని చేయిస్తున్నాడని ఇది ఏమీటి అని అడిగితే ఇష్టం వచ్చినట్లు విద్యార్థులను కొట్టడం జరుగుతుందని తెలిపారు.సరైన లైటింగ్ లేక హాస్టళ్లలో విద్యార్థుల కు పాములు,తేళ్లు ఎన్నోసార్లు కుట్టిన సందర్భాలున్నాయని,అయినా కూడా ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడం అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్లంబర్ కం ఎలక్ట్రిషన్  పిల్లలను పిలవమని ఆదేశిస్తూ వినని పిల్లలను చితకబాదుతున్నడని హాస్టల్లో ప్లంబర్ కం ఎలక్ట్రిషన్ అక్కడ పోస్టింగ్ లేకపోయినా ప్రిన్సిపాల్ కావాలని తనని అక్కడే వర్క్ చేపిస్తున్నారు తక్షణమే ప్లంబర్ ను ఉద్యోగం నుండి తొలగించి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి అన్నారు. అదేవిధంగా సొంత భవనం లేక. ఇరుకు గదుల్లో పడుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు నోట్ బుక్స్ కూడా రాలేదన్నారు. అదేవిధంగా పరుపులు, బెడ్లు క్రింద పడుకోవడం జరుగుతుంది బోర్ నీటి తో విద్యార్థులకు స్నానాలు చేయడం వలన దురదలు, జ్వరం రావడం జరుగుతుంది కాబట్టి తక్షణం విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అనుముల రాజకుమార్, దేవరాజ్, మోహన్, ప్రవీణ్, కుమార్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: