CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీమంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బాలవెలుగు పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్,50 కిలోల బియ్యం పంపిణీ.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు చెందిన పుర ప్రముఖులు హోండా షోరూమ్ అధినేత సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి,సుధారాణి దంపతుల ద్వితీయ కుమారుడు శ్రీమంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సంతోష్ నగర్ లోని బాల వెలుగు పాఠశాలలో విద్యార్థుల కు 40 మందికి నోట్ బుక్స్ ను మరియు 50 కిలోల బియ్యాన్ని వితరణగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.వెంకటేశ్వర్ రెడ్డి,సుధారాణి దంపతులు మాట్లాడుతూ,తమ కుమారుడు శ్రీమంతుడు రెడ్డి జ్ఞాపకార్థం,గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు చదువుకు ప్రోత్సాహం,నిరుపేదలకు అవసరమైన సహకారం, వికలాంగులకు,ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు,తోడ్పాటు మరియు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో,*శ్రీమంత్ రెడ్డి ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీ* స్థాపించి చుట్టుపక్కల గ్రామాల్లో స్థానికంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,తమ కుమారుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది అయినప్పటికీ,తన జ్ఞాపకాలను,నెమరువేసుకుంటూ ఇతరులకు సహాయపడుతూ సంతృప్తి పడుతున్నామని,నిరుపేద విద్యార్థిని విద్యార్థులు, తమలాంటి వారి సహకారంతో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్డి.నాసర్ పాషా, రమణ కుమార్,సుబ్బారెడ్డి, రామిరెడ్డి యాదగిరి,నాగేల్లి జ్యోతి,బాల వెలుగు నిర్వాహకులు బి.జగన్మోహన్ రెడ్డి,సిబ్బంది దేవి,లతా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: