CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో 2వేల మందికి త్వరలో ఉచిత కంటి ఆపరేషన్లు -- : విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


  • రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ &పుష్పగిరి కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శిబిరం
  • ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ విశాల్ గోవింద్ హరి కి  కృతజ్ఞతలు తెలిపిన విప్ రేగా కాంతారావు
  • పినపాక నియోజకవర్గ ఏజెన్సీ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించిన విప్  రేగా కాంతారావు కు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ విశాల్ గోవింద్ హరి


  మన్యం టీవి, మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మంగళవారం హైదరాబాద్ పట్టణంలోని  

 పుష్పగిరి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద్ హరి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేగా  పినపాక నియోజకవర్గంలో సుమారు 2000 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే రేగా  విన్నపానికి స్పందించిన పుష్పగిరి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద్ హరి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో  సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మణుగూరు పట్టణం లో నిర్వహించే  ఉచిత కంటి ఆపరేష స్క్రీనింగ్ టెస్టుల కోసం    తన వైద్య  బృందాన్ని  పంపిస్తామని తెలియజేసినట్లు రేగా తెలిపారు.ఈ సందర్భంగా తన విన్నపానికి  స్పందించిన పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి రేగా  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: