CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఓసి 2 డంపర్ ఆపరేటర్ ఎండీ రకీబ్ ను మానవతా దృక్పథంతో ఉద్యోగం తొలగింపు నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ఉపసంహరించుకోవాలి.ఏరియా జిఎం జక్కం రమేష్ కు వినతి పత్రం అంద చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాలు.

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:


       ఓసి2 డంపర్ ఆపరేటర్ ఎండీ రకీబ్ డిస్మిస్ నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏరియా జనరల్ మేనేజర్  జక్కం రమేష్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ది 18- 8 -2021 వ తేదీ    ఓసి 2 డంపర్ బొలెరో ప్రమాదంలో  డంపర్ ఆపరేటర్ ఎండి రకీబ్ ను బాధ్యుడ్ని చేస్తూ   ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ ది 9-11-2021  సింగరేణి యాజమాన్యం నుండి రకీబ్ కు సీల్డ్ కవర్  అందజేశారనీ , ప్రమాద సంఘటన పట్ల ప్రమాదంలో ఇద్దరు సింగరేణి కార్మికులతో పాటు ఒక ప్రైవేటు కన్వినెన్స్ వాహన డ్రైవర్ కూడా చనిపోవడం మూడు కుటుంబాలలో చీకటి కమ్ముకోవడం  అత్యంత బాధాకరం దురదృష్ట సంఘటనగా వారు విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు, కావాలని ఎవరు ప్రమాదానికి పూనుకోరనీ అనుకోకుండా జరిగేదే ప్రమాదం కానీ ఆపరేటర్ రకీబ్ ను ఉద్యోగం నుండి తొలగించడం ద్వారా తనపై ఆధారపడిన తన కుటుంభ సభ్యులు కూడా ఉద్యోగ తొలగింపు పర్యావసనాన్ని  అనుభవించాల్సి రావటం సమాజంలో  దోషులుగా చిన్న చూపు  ఫలితాన్ని కూడా  ఎదుర్కోవలసి ఉంటుందనీ, కుటుంబం కూడా అన్యాయమై పోతుందనీ ,ప్రమాద సంఘటన జరిగినప్పటి నుంచి ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులతో పాటు  రకీబ్  పశ్చాత్తాప పడటం ఆయన కుటుంబ సభ్యులు  కూడా ఎంతగానో ఆందోళన పడుతున్నారని , రకీబ్ ను   ఆయన కుటుంబ సభ్యులకు ఎదురయ్యే ఎన్నో విధాల  ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో సింగరేణి ఉద్యోగిగా కొనసాగించాలని మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు గా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు, GM  సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు B వీరస్వామి, అవుల నాగరాజు (AITUC) వెలగపల్లి జాన్ ( INTUC) నందం ఈశ్వరరావు(CITU) వీరమని రవీందర్ రావు (BMS) బి కుమార్ (HMS) ఎస్ డి  నా సర్ పాషా (IFTU)తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: