CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ 29 శాఖలో ఉన్న జీవోలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయాలి--:గోవిందరావుపేట మండల కమిటీ ఎన్నిక.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో గిరిజన బాలుర వసతి గృహము నందు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్, జిల్లా ఉపాధ్యక్షులు పోదెం నాగేశ్వరరావు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు కోరగట్ల లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండల కమిటీ ఎన్నిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నిబెల్లి విరేశం,మరియు రాష్ట్ర కోశాధికారి చంద రఘుపతి, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మరియు రాష్ట్ర బాధ్యులు నారాయణ,అన్య బోయిన సమ్మయ్య హాజరై మాట్లాడుతూ.ముందుగా బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల తో భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులు చట్టాలను ఇటు ప్రభుత్వాలు అటు అధికారులు అమలు చేయకుండా ఆదివాసీల పై అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూ అంతర్గతంగా ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తూ ఆదివాసీల చట్టాలను హక్కులను నిర్విరామం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర కార్యదర్శి కొర్నిబెల్లీ వీరేశం మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం మరియు జీవో నెంబర్ 102 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎఫ్ ఆర్  సి కమిటీ లో స్థానిక ఆదివాసులే అధ్యక్ష కార్యదర్శి మరియు కమిటీ సభ్యులను ఆదివాసులను నియమించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా గిరిజనేతరులు కూడా కమిటీ లో చేర్చి ఆదివాసీలకు మరియు వారి హక్కులు చట్టాలకు విరుద్ధంగా సంకేతాలను బహిర్గత పరిచిన దాని అన్నారు.ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని 29 ప్రభుత్వ శాఖలలో ఉన్న 29 ప్రత్యేక జీవోలను అంతర్గతంగా అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేసి పైకి ఆదివాసి సమాజాన్ని నడిపించడానికి ఆదివాసీలకు అనుకూలంగా ఉన్న చట్టాలను హక్కులను అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 29 శాఖలకు సంబంధించిన జీవోలను నిలుపుదల చేసినట్లు గా ఉందని అన్నారు.ఈ జీవోలను యధావిధిగా అమలు చేయాలని ఆదివాసి కుల సంఘాలు,ఉద్యోగ సంఘాలతో  ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని అన్నారు.అనంతరం గోవిందరావుపేట మండల తుడుందెబ్బ కమిటీని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా చర్ప లక్ష్మీనారాయణ,ప్రధాన కార్యదర్శిగా చెరుకుల నాగయ్య,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా దుగ్గి నారాయణ,ఉపాధ్యక్షులుగా బోదె బోయిన ముత్తయ్య, గండేపల్లి నాయుడు,చీమల లక్ష్మీనారాయణ,సహాయ కార్యదర్శులు గా కల్తీ నారాయణ,ఈసం రాకేష్, గుంట్టి శ్రీధర్,ప్రచార కార్యదర్శిగా ఆరేం సాంబయ్య, కార్యవర్గ సభ్యులుగా ధన సరి గాంధీ, పూసం శ్రీకాంత్, శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Share it:

TS

Post A Comment: