CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా బిర్సాముండా 146వ జయంతి కార్యక్రమం నూ నిర్వహించిన ఆదివాసీ సేన

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లలితా పురం గ్రామంలో స్వాతంత్ర్య, స్వయం పాలన పోరాటంలో బ్రిటిష్ వారు వెన్నులో వణుకు పుట్టించిన బిర్సాముండా పోరాటాలనూ, ఆదివాసీ హక్కులను, స్వయం పాలన ఉద్యమలనూ స్మరిస్తూ.. బిర్సాముండా జయంతి జనజాతియ ఆత్మ గౌరవ దేవాస్ గా ప్రకటించి.. వేడుకలు నిర్వహించడం పట్ల ఆదివాసీల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనట్లు ఆదివాసీ సేన మండల కన్వీనర్ పూనెం కోటేశ్వరరావు తెలిపారు.ఈ మేరకు, ఆదివాసీ సేన అధ్వర్యంలో బిర్సాముండా 146వ జయంతిని "ఆదివాసీ ఆత్మ గౌరవ దివాస్" గా వేడుకలనూ, ముందుగా బిర్సాముండా , కొమరం భీం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ..   స్వాతంత్ర్య స్వయం పాలన పోరాటంలో బిర్సాముండా పోరాటం ప్రత్యేకమైనదని, ఆనాటి కాలంలోనే వనరుల దోపిడీకి వ్యతిరేకంగా, స్వయంపాలన కోసం, భూమి పైన సర్వహక్కులు ఆదివాసిలవి అని, ఆదివాసీ ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేక మైనవని, ఆదివాసీ జీవన విధానాల లో ఇతరుల జోక్యం వలన అనేక నష్టాలు, అవరోధాలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించి పోరాడిన మహోన్నత మైన వ్యక్తి బిర్సాముండా అని కొనియాడారు, బిర్సాముండా పోరాటం..  బ్రిటిష్ వారు అవలంబిస్తున్న వ్యతిరేక నిర్ణయాలు వల్ల నష్టపోయిన బాధిత ప్రజలలో, ఆదివాసీ లలో కల్గించిన స్ఫూర్తితో. ఆయనను ప్రజలందరూ భగవాన్ బిర్సాముండా గా కొలుచుకుంటూనారని అన్నారు. ముఖ్యంగా బిర్సాముండా.. ఆదివాసీగా ఆదివాసీతత్వంనూ అవలంభిస్తూ, జీవించడం ద్వారానే మనుగడ, రక్షణ ఉంటుందని, మనలనూ మనం నమ్ముకొని ధర్మంగా, న్యాయంబద్దమైన పోరాటం చేస్తే విజయం తప్పక వరిస్తుందని తెలియజేశారనీ, అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతాలకూ ఎవరూ వచ్చినా కూడా.. ఆదివాసుల  మీద ఆధిపత్యం చెలాయించడానికో, వనరులను దోచుకోవడానికో..  భూములు  కోసం వస్తున్నారు తప్ప.. ఆదివాసిల పైన ప్రేమతోనో, ఆదివాసీల మేలు కోసం రావడం లేదని, ఆదివాసీలకు అరకొరగా కొన్ని సదుపాయాలు కల్పించి, అన్ని వనరుల దోపిడీకి చేసే ప్రయత్నంనూ, ప్రణాళికనూ ముందుగానే  గ్రహించి, పోరాటం చేశారని అన్నారు. బిర్సాముండా ఈ ప్రాంతం మాది.. ఇక్కడ పరిపాలన మాది.. ఇక్కడ వనరులు మావి వనరుల పై హక్కుల మావి అని తెలుపుతూ.. పరాయి పాలన వద్దు స్వయం పాలన ముద్దు అని చేతన్యం చేసి దేశ ఆత్మ గౌరవం పోరాటానికి పటిష్ట పునాదిని వేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  బిర్సాముండా  యొక్క స్వయంపాలన ఆకాంక్షలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలకూ స్వయం పాలన కౌన్సిల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.బిర్సాముండా యొక్క స్ఫూర్తితో, ఆదివాసులందరూ..  ఆదివాసీ స్వయంపాలన అమలు చేసుకోవడంలో చైతన్యవంతులు కావాలని, షెడ్యూల్ ప్రాంతంలో సర్వ హక్కులు పొందేలా ఉద్యమంలో ఆదివాసీ ప్రజానీకం భాగస్వాములవ్వాలని, ఐక్య పోరాటాలనూ రూపొందించుకొని, పటిష్ట ఉద్యమం నిర్మాణం చేస్తూ, పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెసా కార్యదర్శి వజ్జ నిర్మల, ఇర్ప కోటేష్, గ్రామ పటేల్ అరెం వీరయ్య, 

పూనెం సాగర్, సుర్నబాక శ్రీనివాస్, కుంజ సంపత్, ఊకె కిషోర్, కల్తీ చంటి,దనసరి శ్రీకాంత్, 

 ఇర్ప వెంకటనారాయణ,  

ఇర్ప సత్యం, జోగ రమేష్   తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: