CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మున్సిపల్, కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ కార్మికులకు 11 వ పీఆర్సీ అమలు చేయాలి,జీతాలు ఇవ్వాలి:ఏఐటీయూసీ,ఐఎఫ్ టియు

Share it:

 




మన్యం టీవీ మణుగూరు: రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘం ల పిలుపు మేరకు మణుగూరు లో ఏఐటీయూసీ,ఐఎఫ్ టియు అధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 11వ పీఆర్సీ వేతన జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది మాధవి కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అర్ లక్ష్మినారాయణ,ఐఎఫ్ టియు జిల్లా నాయకులు గౌస్ పాషా లు మాట్లాడుతూ, మున్సిపాలిటీ లలో పనిచేస్తున్న పారిశుధ్యం, గార్డెన్,వాటర్ సప్లయ్,పంప్ డ్రైవర్స్,ఆపరేటర్,ఎలక్ట్రీషియన్,అటెండర్,ఆపరేటర్ లాంటి కార్మికులు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులు చాలి,చాలని వేతనాలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసనీ,11 వ పీఆర్సీ,జీవో 60 ప్రకారం జీతాలు పెంచి వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ,మున్సిపల్ కార్యాలయం లో వినతి పత్రం అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పిఓ డబ్ల్యు, నాయకులు రాజేందర్,కె. సంతోష్ లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: