CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షేల్ పికింగ్ టెండర్లను సివిల్ విభాగంలోనే పునరుద్ధరించాలి ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో soto GM జిమ్ శ్రీ డి లలిత్ కుమార్ కి వినతిపత్రం అందజేత.

Share it:

మన్యం టీవి, మణుగూరు:   
మణుగూరు ఏరియా షేల్ పికింగ్ టెండర్లను పాత పద్ధతిలోనే సివిల్ విభాగానికి మార్చాలని డిమాండ్ చేస్తూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా so to gm డి లలిత్ కుమార్ గారికి శనివారం సాయంత్రం వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు మిడిదొడ్డి నాగేశ్వరావు మాట్లాడారు,సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సివిల్ విభాగంలో షేల్ పికింగ్ పనులకై మూడు షిఫ్ట్ లకు గాను KCSP లో 27 మస్టర్ లకు గాను 33 మంది, ఓసి 4 లో 18 మస్టర్ లకు 23 మంది,మణుగూరు ఓసీలో 18 మస్టర్ లకు 24 మంది సింగరేణి భూ నిర్వాసితులు స్థానిక నిరుద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు, తమ బ్రతుక్కి భరోసా దొరికిందన్న సంతోషం వారిది ఇది 8 నెలల క్రితం కథ కానీ సింగరేణి యాజమాన్యం ఆకస్మికంగా సివిల్ విభాగంలో ఉన్న టెండర్ నీ కాస్త యూనిట్ టెండర్ గా మారుస్తూ పర్చేజ్ విభాగానికి బదిలీ చేశారు, యూనిట్ ఆధారిత టెండర్ నాణ్యతా పరంగా యాజమాన్యానికి ఉపాధి పరంగా కాంట్రాక్ట్ కార్మికులకు మరియు ఆర్థికపరంగా సంబంధిత కాంట్రాక్టర్ కూడా నష్ట కరమని ఈ ప్రక్రియకు ముందు కూడా ఐ ఎఫ్ టి యు లిఖితపూర్వకంగా సింగరేణి యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను కూడా హెచ్చరించాము, యూనిట్ పనుల ప్రక్రియ పనులు ప్రారంభం అయినప్పటి నుండి ఈ పనినే నమ్ముకున్న కాంట్రాక్ట్ కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి ఓ సి 4,మణుగూరు ఓ సి ల లో సుమారు 30 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉపాధి కోల్పోయారు, ఈ కష్టాలు యాజమాన్యానికి తెలియనివి కావు,మూలిగే నక్కపై తాటిపండు లా మధ్యలో covid కష్టాలు, ఇల్లు గడవక అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ కుటుంబాల తో ఇబ్బంది పడుతున్న మానవీయ కోణాన్ని కూడా యాజమాన్యం స్పృశించాలి, ఇప్పటికైనా స్థానిక యాజమాన్యం స్పందించి సింగరేణి భూనిర్వాసితుల స్థానికులు 70 మందికి పైగా ఉపాధి పొందుతున్న షేల్ పికింగ్ టెండర్ ను గతంలో మాదిరిగా సివిల్ విభాగంలో మస్టర్ లింక్డ్ టెండర్ ప్రక్రియ గా పునరుద్ధరించాలని సింగరేణి భూనిర్వాసితుల స్థానికులు (70 మందికి) న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము కోర్కెలు: ఏరియాలోని KCSP ,ఓ సి-4, మణుగూరు ఓసి లో షేల్ పికింగ్ టెండర్లను సివిల్ విభాగం లో పునరుద్ధరించాలి. ఉపాధి కోల్పోయిన 30 మందికి తిరిగి పని కల్పించాలి, 2) ఓ సి 4, మణుగూరు ఓసి షేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి, ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు ఏ మంగీలాల్, నల్లా రమేష్, సాధన పల్లి రవి, బి లక్ష్మీనారాయణ, రాస మల్ల నాగరాజు, నువ్వుల రాజేష్, G ఏశవ్, ఎస్ కే ముస్తఫా, కేవీ కృష్ణ, టి రాజేష్, నరసింహారావు, బాలరాజు వి కృష్ణారావు జి చిరంజీవి కట్టా రాజ్ కుమార్ , చిట్టి బాబు, రాంబాబు, భావూసింగ్, వెంకన్న, జయరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: