CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణాన్ని నిలుపుదల చేసి ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాలి

Share it:



మన్యం టీవి టేకులపల్లి :

       విద్యార్థి సంఘాల డిమాండ్


 టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వ కళాశాల మైదానంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని, ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి వైద్యశాల నిర్మాణాన్ని చేపట్టాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృద్వి, చంద్రన్న వర్గం  PDSU జిల్లా కార్యదర్శి సాంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాల భూముల్లో చట్టబద్ద అనుమతులు లేకుండా విద్యార్థుల ఆరోగ్యాలను గాలికొదిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపట్టడాన్ని ఖండించారు.కళాశాల ప్రిన్సిపల్ నుండి గానీ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నుంచి గానీ లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా,కళాశాల ఆవరణంలో అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు అనే నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టారు.దీనివలన భవిష్యత్తులో కళాశాల ఆవరణలో వివిధ రకాల రోగగ్రస్తులు సంచరించడం వలన విద్యార్థుల ఆరోగ్యాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది,భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి నూతన భవనాలు నిర్మించాలనుకుంటే స్థలం ఉండదు,కళాశాల క్రీడాస్థలం లేకపోవడం ద్వారా విద్యార్థులు మానసికోల్లాసానికి ఉపయోగపడే క్రీడలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

విద్యార్థుల ఆనారోగ్యానికి కారణమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందున, క్రీడా స్థలం లేనందున విద్యార్థుల అనాసక్తితో అడ్మిషన్లు రాక భవిష్యత్తులో కళాశాల పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిని వ్యతిరేకించడం లేదని,ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధిని తాము స్వాగతిస్తామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాన్ని వేరే చోటకు తరలించాలని వారు కోరారు.లేనిపక్షంలో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపేంతవరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో PDSU జిల్లా నాయకులు రవి,గణేష్ లు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: