CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ పండగ సందర్బంగా కులమతాలకు అతీతంగా కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ - DCMS వైస్ చైర్మన్ కొత్వాల

Share it:



తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగ ను పురష్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు  కుల, మతాలకు అతీతంగా  ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాతపాల్వంచలోని  హైస్కూల్ ఆవరణలో కొత్వాల బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల తో సుమారు ఒక లక్ష బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నామన్నారు. కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర  నుండి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కేక్ లు, హిందువులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కెసిఆర్ దసరా కానుకగా మహిళలకు బతుకమ్మ  చీరలు ఇస్తున్నారన్నారు. 


ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది బొందిల రాంబాబు, చక్రధర్ రావు,సాబీరాబేగం,  యాటా అరుణ, పుష్పలత,  లక్ష్మి, గంగుల త్రిదేవ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు ఫరీద్,  నాగసత్యం, శ్యామ్, సాయి కిరణ్, షాహిద్,జమీర్, పాషా, అఖిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: